Rashmika Mandanna: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ జంట తాము రిలేషన్ లో ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో వారిని పదే పదే అడిగినా తెలివిగా సమాధానలు చెబుతూ దాటవేసేస్తూ వచ్చారు. అయితే ఒక్కోసారి విజయ్, రష్మికలు సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు ఆ వార్తలకు బలం చేకూర్చుతుంటాయి. వారి పోస్ట్ లలో లాజిక్ లను వెతుకుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుపుతారు నెటిజన్స్. అయితే రీసెంట్ గా రష్మిక పెట్టిన ఓ పోస్ట్ మళ్లీ వీరి డేటింగ్ పై చర్చలకు దారితీసింది.
 
విజయ్ తో ఆ సినిమా నాకెంతో స్పెషల్..


రీసెంట్ గా రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది. అదేంటంటే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి 2019 లో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇందులో రష్మిక, విజయ్ ల కెమిస్ట్రీకు మంచి పేరు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా నుంచే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమా సమయంలో దిగిన ఓ ఫోటోను రష్మిక షేర్ చేసింది. ఈ ఫోటోలో మూవీ రష్మిక, విజయ్ లతో పాటు మూవీ దర్శకుడు భరత్ కమ్మ కూడా ఉన్నారు. దానితో పాటు రష్మిక ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ఈ మూవీ తనకెంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రష్మిక ఈ పోస్ట్ పెట్టింది. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మూవీ నుంచే వారి లవ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ మూవీ రష్మిక కు నిజంగా స్పెషల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


రష్మిక, విజయ్ లు కలిసి మొట్టమొదటి సారిగా 2018 లో ‘గీతా గోవిందం’ అనే సినిమాలో నటించారు. ఈ మూవీకు పరుశురాం దర్శకత్వం వహించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. తర్వాత ఏడాది వీరిద్దరి కాంబోలో ‘డియర్ కామ్రేడ్’ వచ్చింది. ఈ మూవీలో రష్మిక, విజయ్ జంటకు మంచి పేరు వచ్చింది. అయితే తర్వాత వీరిద్దరూ ప్రయివేట్ పార్టీలు, సినిమా ఫంక్షన్ లలో తప్ప స్క్రీన్ మీద కలిసి కనిపించలేదు. 


ఎవరి సినిమాల్లో వారు బిజీ..


విజయ్ దేవరకొండ గతేడాది ‘లైగర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. ఈ మూవీ తర్వాత ఆయన ఇప్పుడు సమంతతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో నటించారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నాడు విజయ్. ఇక రష్మిక నటించిన ‘పుష్ప’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప 2’ ను తెరెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు హిందీలో ‘యానిమల్’ అనే సినిమాలో నటించింది.  మరికొన్ని సినిమాల్లో భాగస్వామ్యం కానుంది రష్మిక.


Also Read: చైనా పాఠ్యపుస్తకాల్లో భారత నటుడి జీవిత గాధ - వెయిటర్‌ నుంచి ఓనర్‌గా ఎదిగిన దేవ్ రాటూరీ, మూవీ స్టార్ ఎలా అయ్యారు? 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial