మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల్ 29 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సరైన కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. దీంతో దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు డబ్బులు తిరిగిస్తున్నట్లు సమాచారం. 


ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో విడుదలైన మూడు వారాల తరువాత సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే మే చివరి వారం నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయాలి. కానీ ఇప్పుడు కాస్త ముందుగానే మే 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 


ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలను ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. 'రాధేశ్యామ్', 'గని' సినిమాల విషయంలో ఇలానే జరిగింది. ఇప్పుడు  'ఆచార్య'ను కూడా మూడు వారాల కంటే ముందే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక మే 20నే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ఓటీటీలోకి రాబోతుంది.  


Also Read: 'సర్కారు వారి పాట' ఫేక్ కలెక్షన్స్ - ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు