ఈ ఏడాది సమ్మర్ లో వివాహ ముహార్తాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది పెళ్లి పెళ్లిపీటలెక్కేస్తున్నారు. సినిమా, టీవీ కు సంబంధించిన నటీనటులు, ఆర్టిస్ట్ లు చాలా మంది వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు పెళ్లిల్లు జరిగాయి కూడా. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం కూడా ఘణంగా జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి అవివి బిద్దప్ప మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అభిషేక్-అవివల వివాహం బెంగళూరులో సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. 

అభిషేక్-అవివ ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబు, కన్నడ స్టార యశ్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ వివాహానికి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి కొత్త జంట అభిషేక్-అవివ లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. 

ఫ్యాషన్ షో లో పరిచయం ప్రేమగా మారి..

అభిషేక్-అవివ లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్నారు. ఈ మధ్య అభిషేక్ లవ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో వీరి ప్రేమాయణం పై పలు సార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అభిషేక్ అవివ ను కొన్నేళ్ల క్రితం ఓ ఫ్యాషన్ షో ఈవెంట్ లో కలుసుకున్నారు. అప్పుడే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. క్రమేపీ ఆ పరిచయం కాస్తా స్నేహంగా ఆపై ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఇద్దరికీ మూడేళ్లు వయసులో తేడా కూడా ఉంది. తర్వాత వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించారు. గత డిసెంబర్ 11 న అభిషేక్-అవివ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. తాజాగా పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. అవివ ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తోంది. మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లో కన్నడ నాట మంచి గుర్తింపు ఉంది. 

ఇక సీనియర్ నటి సుమలత విషయానికొస్తే.. సుమలతకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆమె Abishek - Aviva Marriage: తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ పదుల సంఖ్యలో సినిమాలు చేసి అభిమానుల్ని సొంతం చేసుకుంది. సుమలత కన్నడ నటుడు అంబరీష్ ను పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. సుమలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది.  ఆమె భర్త అంబరీష్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. దీంతో సుమలత కూడా భర్త బాటలోనే రాజకీయాల్లో కొనసాగుతోంది. ఆమె 2019 ఎన్నికల్లో కర్ణాటక లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ గా గెలుపొందినది.