బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా.. నాగచైతన్య కీలకపాత్రలో తెరకెక్కిన సినిమా 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చిరంజీవి గట్టిగానే పాల్గొంటున్నారు. చిరంజీవి, ఆమిర్ ఖాన్, నాగచైతన్యలతో కలిసి నాగార్జున ఒక స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ చేశారు. 


ఈ సందర్భంగా.. చిరంజీవితో ఓ సినిమా చేయాలనుందని, ఆమిర్ ఖాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాట విన్న చిరంజీవి వెంటనే ఓ కండీషన్ కూడా పెట్టారు. 'అన్నీ ఫస్ట్ టేక్ లో ఓకే చేస్తాను అంటేనే' అంటూ చిరు డైలాగ్ కొట్టారు. ఆమిర్ ఖాన్ ను మిస్టర్ పెర్ఫెక్ట్ అని పిలుస్తారు. తనకు కావాల్సినట్లుగా సీన్ వచ్చేవరకు ఆయన కాంప్రమైజ్ అవ్వరు. టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు. అందుకే చిరంజీవి అలా అన్నారు. 


దానికి రియాక్ట్ అయిన హోస్ట్ నాగార్జున.. 'డైరెక్షన్ వద్దు.. మీరు నిర్మాతగా ఉంటేనే బెటరేమో' అని అన్నారు. సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి మాటలు రావడం కామనే. కానీ చిరంజీవితో సినిమా చేయాలని ఆమిర్ ఖాన్ చాలా కాలంగా అనుకుంటున్నారు. ఒకవేళ చిరంజీవితో నేరుగా సినిమా చేయకపోయినా.. ఆయన నటించిన సినిమాను ఆమిర్ బాలీవుడ్ లో ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. 


ఇదే సందర్భంలో.. ఆమిర్ ఖాన్ నటించిన ఏ సినిమాను మీరు తెలుగులో రీమేక్ చేస్తారనే ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. దానికి చిరు.. 'ఆమిర్ ఖాన్ సినిమా చూడడమే కానీ.. చేయడం కుదరదు' అంటూ చెప్పుకొచ్చారు. ఆమిర్ ఖాన్ ఇమేజ్, చిరంజీవి ఇమేజ్ రెండూ వేర్వేరు. కంపేర్ చేయలేం. అందుకే చిరంజీవి అలా అన్నారు.   


Also Read: ‘అబ్బా అబ్బా’ సాంగ్.. సుధీర్, దీపిక పిల్లి రొమాన్స్ - రాఘవేంద్రరావు పాటంటే ఆ మాత్రం ఉండాలి




Also Read: హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్