Aamir Khan buys new apartment in Mumbai: సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును నటీనటులు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొంత మంది దుస్తులు, కాస్మోటిక్స్ రంగంలో పెట్టుబడులు పెడితే, మరికొంత మంది నగల దుకాణాలు, జిమ్ లు, హోటళ్లు రన్ చేస్తున్నారు. ఇంకొంత మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాత్రం ప్రాపర్టీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్ మెంట్లు, బంగళాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన ఆయన, తాజాగా మరో ప్రాపర్టీని తీసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చించారు.


రూ.9.67 కోట్లతో కొత్త భవంతిని కొనుగోలు చేసిన అమీర్ 


ముంబైలోని ప్రైమ్ ఏరియా అయిన బాంద్రా సబర్బ్ లో అమీర్ ఓ లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు. ఈ అపార్ట్ మెంట్ 1027 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవంతి కొనుగోలు కోసం ఆయన రూ. 9. 75 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. జూన్ 25న ఆయన ఈ భవంతిని కొనుగోలు చేశారు. ఇందుకోసం అతడు రూ. 58 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.


అమీర్ ఖాన్ దగ్గర బోలెడు లగ్జరీ అపార్ట్ మెంట్లు


అమీర్ ఖాన్ కు అదే ఏరియాలోని మెరీనా బెల్లాబిస్టా అపార్ట్‌ మెంట్ల‌లో 9 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 24 యూనిట్లు ఉండగా, తొమ్మదింటిని ఆయనే కొనుగోలు చేశారు.  అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా,  కిరణ్ రావు కూడా అదే కాంప్లెక్స్‌ లో నివసిస్తున్నారు. బాంద్రాలో సముద్రం ఒడ్డున 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో భారీ భవంతి కూడా ఉంది.  పంచగనిలో ఫామ్‌ హౌస్ ఉంది. ముంబైలోని కార్టర్ రోడ్‌లో మరో అపార్ట్‌మెంట్ ఉంది. ఉత్తరప్రదేశ్‌లో పలు వ్యవసాయ భూములు, భవంతులను కలిగి ఉన్నాడు. ఢిల్లీలోనూ ఆయనకు అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి.


తారే జమీన్ పర్’ సీక్వెల్ తెరకెక్కిస్తున్న అమీర్ ఖాన్


ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించారు. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో ఆయన కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించారు.  ఇక ఆయన గతంలో దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ‘సితారే జమీన్ పర్’ అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైన్ ఖాన్ ఈ మధ్యే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా నటించిన ‘మహారాజ్’ అనే సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆయన మాజీ భార్య కిరణ్ రావు రీసెంట్ గా తెరకెక్కించిన ‘లాప‌టా లేడీస్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.



Read Also: ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్‌ సేతుపతి బ్లాక్‌బస్టర్‌ మూవీ 'మహారాజ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..