యూట్యూబ్‌లో ఎన్నో రకాల క్రియేటివ్ కంటెంట్ దొరుకుతుంది. ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకొనేందుకు యూట్యూబ్‌ను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీ మేకర్స్ కూడా ఆ కంటెంట్‌తో సినిమాలు నిర్మించేందుకు ముందుకొస్తున్నారు. అలా ఎన్నో చిత్రాలు మన ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే, కొన్ని మాత్రం వర్కవుట్ కాలేదు. మరి, షర్ట్ ఫిల్మ్స్ స్ఫూర్తితో తెరకెక్కిన ఆ మూవీస్ ఏమిటో చూద్దామా!


1. శ్రీకారం


2016లో ఎమ్మార్ ప్రొడక్షన్స్ నుంచి ‘శ్రీకారం’ అనే షార్ట్ ఫిలిమ్ వచ్చింది. చదువుకున్న యువకులు వ్యవసాయం వైపు వెళ్లడమే ఈ ఫిలిమ్ కాన్సెప్ట్. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం నటించాడు. ఈ షార్ట్ ఫిలిమ్ కు మంచి గుర్తింపు రావడంతో కిరణ్ ఫుల్ లెన్త్ సినిమా చేయాలి అనుకున్నాడు. 2017లో స్క్రిప్ట్ మొదలు పెట్టారు. 2021లో ‘శ్రీకారం’ పేరుతోనే సినిమా విడుదల చేశారు. ఆ కంటెంట్‌కు కరోనా సమయంలో ఎదురైన సమస్యలను జోడించి ‘శ్రీకారం’ తీశారు. శర్వానంద్ ఇందులో హీరోగా నటించాడు. కానీ, ఆ మూవీ బిగ్ స్క్రీన్‌పై ఆకట్టుకోలేకపోయింది. 


2. నాన్ సిరితాల్


హిప్ హాప్ తమిళ హీరో యాక్ట్ చేసిన ఈ మూవీ 2020లో రిలీజ్ అయ్యింది. దీన్ని 2017లో వచ్చిన ‘కెక బెక కెక బెక’ అనే ట్రాజిక్ కామెడీ షార్ట్ ఫిలిమ్ నుంచి తీశారు. హీరో బాధ, కోపం, స్ట్రెస్ వస్తే విపరీతంగా నవ్వే, నర్వస్ లాఫ్టర్ అనే డిజార్డర్ ను కలిగి ఉంటాడు. ఈ నేపథ్యంలో సీరియస్ సందర్భాల్లో నవ్వడం వల్ల పలు సమస్యలు వస్తాయి. ఇదే షార్ట్ ఫిలిమ్ కు లవ్, యాక్షన్ సన్నివేశాలు జోడించి ‘నాన్ సిరితాల్’ అనే సినిమాను తీశారు.


3. లవ్ ఫేల్యూర్


తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. సిద్ధార్థ్ హీరోగా నటించాడు. దర్శకుడు బాలాజీ మోహన్  అంతకు ముందు తాను తీసిన ‘కాదలెల్ సొదప్పవదు యెప్పడి’ అనే షార్ట్ ఫిలిం ఆధారంగా తీశారు. తమిళ సినిమాకు ఇదే పేరు పెట్టారు. తెలుగులోకి వచ్చే సరికి ‘లవ్ ఫేల్యూర్’ అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ గా అమలా పాల్ నటించింది.


4. డాన్


ఈ సినిమాను ‘బిట్టు’ అనే షార్ట్ ఫిలిం నుంచి తీసినట్లు దర్శకుడు శిబి చక్రవర్తి వెల్లడించారు. అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో ‘బిట్టు’ అనే షార్ట్ ఫిలిమ్ చేశాడు. దాన్ని హీరో విజయ్ కి చూపించాడు. ఆయన ఈ షార్ట్ ఫిలిమ్ ను ప్రశంసించడంతో ఫుల్ లెన్త్ సినిమా చేశారు. ప్రిన్స్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది.


5. లైట్స్ అవుట్


2016లో వచ్చిన ఈ హార్రర్ ఫిలిమ్ బాగా పాపులర్ అయ్యింది. 5 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరక్కిన ఈ సినిమా 150 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. 2013లో డేవిడ్ శాండ్ బర్గ్ 3 నిమిషాల షార్ట్ ఫిలిమ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. సినిమా తీయాలని చాలా ప్రొడక్షన్ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయి. కేవలం 2 సీన్లు ఉన్న షార్ట్ ఫిలిమ్ కు స్టోరీ యాడ్ చేసి 2016లో సినిమాగా తీశారు. ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది.


6. విప్లాష్


‘లా లా ల్యాండ్’తో బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్న డిమియన్ చెజిల్ తీసిన తొలి సినిమా ఇది. వాస్తవానికి ‘లా లా ల్యాండ్’ సినిమా తీద్దామని అనుకున్నా, ప్రొడ్యూసర్స్ రాకపోవడంతో ఒక షార్ట్ ఫిలిమ్ తీసి తన సత్తా చాటుకోవాలి అనుకున్నాడు. 2013లో ‘విప్లాష్’ అనే షార్ట్ ఫిలిమ్ చేశాడు. ఈ షార్ట్ ఫిలిమ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులను గెల్చుకుంది. అక్కడ ప్రొడ్యూసర్స్ ఈ స్క్రిప్ట్ ను మూవీ కోసం డెవలప్ చేయాలని అడగడంతో ఏడాది లోగా సినిమా చేశారు. ఈ సినిమా ఏకంగా మూడు ఆస్కార్ అవార్డులను అందుకుంది.


7. లవ్ టుడే


ఇదే టైటిల్ తో 1997లో విజయ్ నటించిన ఓ సినిమా వచ్చింది. దాన్నే తెలుగులో ‘సుస్వాగతం’ సినిమాగా రీమేక్ చేశారు.  అయితే 2022లో ‘లవ్ టుడే‘ అనే సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు ప్రదీప్ రంగనాథన్. ఆయన తీసిన ‘అప్పా లాక్’ అనే షార్ట్ ఫిలిమ్ నుంచే ‘లవ్ టుడే’ అనే సినిమా తీశాడు. ‘అప్పా లాక్’ అనే షార్ట్ ఫిలిం పాపులర్ కావడంతోనే ‘కోమలి’ అనే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం లభించింది.


8. అందాదున్


కన్నడలో బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇదే సినిమా తెలుగులో మాస్ట్రోగా రీమేక్ అయ్యింది. కన్నడ దర్శకుడు హేమంత్ 2013లో శ్రీరామ్ రాఘవన్ కు ‘ ది పియానో ట్యూనర్’ అనే ఫ్రెంచ్ షార్ట్ ఫిలిమ్ చూపించాడు. ఆయనకు చాలా నచ్చడంతో దాన్ని బేస్ చేసుకుని ‘అందాదున్’ సినిమాగా చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఆ షార్ట్ ఫిల్మ్‌లో అంథుడుగా నటించే వ్యక్తి తన కళ్ల ముందే శవం ఉన్నా.. భయంతో పియానో వాయించే సీన్ మాత్రమే ఉంటుంది. మిగతా కథ అంతా సినీ దర్శక, రాచయితలు క్రియేట్ చేసిందే. 


Read Also: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?