కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘777 చార్లి’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ప్రతి భాషలోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జూన్ 10న విడుదలైన సినిమా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లింది. దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. చార్లి అనే కుక్కకు ఒక వ్యక్తికి మధ్య సంబంధాన్ని ఈ సినిమాలో అందంగా చూపించారు. ఆ అనుబంధానికే ప్రేక్షకులు పట్టం కట్టారు. చివరికి కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కూడా ఆ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నారు. ఆ సినిమా అంతగా గుండెకు తాకుతుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. 


ఏ ఓటీటీలో...
777 చార్లి సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు టాక్. అయితే ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు. ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అయ్యేందుకు నెల లేదా నెలన్నర సమయం పడుతుందని మాత్రం అంచనా. ఇందులో ముఖ్య పాత్ర పోషించి రక్షిత్ శెట్టి కన్నడలో ఎదుగుతున్న యంగ్ హీరో. గతంలో రష్మిక మందన్నతో ఎంగేజ్మెంట్ అయిన హీరో ఇతనే. తరువాత ఆ నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత రష్మిక తెలుగులో చాలా బిజీ అయిపోయింది.  






 



Also read: ట్రెండీగా బాలీవుడ్ నటి సోనమ్ సీమంతం


Also read: ఒక్క ట్వీట్‌తో జీహెచ్ఎంసీ అధికారులను ఇరికించేసిన అనుపమా