68వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కథియావాడి’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి సహా 10 కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత ‘బదాయి దో’ చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను గెల్చుకుని సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా చార్ట్ బసర్ట్ గా నిలిచిన ‘కేసరియా’ సాంగ్ రెండు అవార్డులను అందుకుంది. ఉత్తమ నటిగా ఆలియా భట్, ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు, ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ అవార్డులను అందుకున్నారు. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముంబైలో 68వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నది వీళ్లే!
- బెస్ట్ మూవీ- గంగూబాయి కథియావాడి
- బెస్ట్ డైరెక్టర్- సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ మూవీ(క్రిటిక్స్) - బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి)
- బెస్ట్ యాక్ట్రెస్-ఆలియా భట్ (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ యాక్ట్రెస్(క్రిటిక్స్)- టబు (భూల్ భులాయా 2), భూమి పెడ్నేకర్ (బదాయి దో)
- బెస్ట్ యాక్టర్- రాజ్ కుమార్ రావు (బదాయి దో)
- బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్)- సంజయ్ మిశ్రా (వధ్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్-షీబా చద్దా (బదాయి దో)
- బెస్ట్ కొరియోగ్రఫీ- కృతి మహేశ్ (డోలిడా- గంగూబాయ్ కథియావాడి)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్- జస్పల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వల్ (వధ్)
- బెస్ట్ డెబ్యూ హీరో- అంకుశ్ గదం (ఝండ్)
- బెస్ట్ డెబ్యూ హీరోయిన్- ఆండ్రియా కెవిచుసా (అనేక్)
- బెస్ట్ సాంగ్ రైటర్- అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట)
- బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్- ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర 1)
- బెస్ట్ సింగర్(మేల్)- అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర 1- కేసరియా)
- బెస్ట్ సింగర్(ఫీమేల్)- కవిత సేత్ (జుగ్‌జుగ్ జియో- రంగిసా)
- బెస్ట్ స్టోరీ- అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి (బదాయి దో)
- బెస్ట్ స్క్రీన్ ప్లే- అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బదాయి దో)
- బెస్ట్ డైలాగ్స్- ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్- సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ సినిమాటోగ్రఫీ- సుదీప్ చటర్జీ (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్- సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - షీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కథియావాడి)
- బెస్ట్ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ దీపక్ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1)
- బెస్ట్ ఎడిటింగ్- నీనద్ కలంకార్ (ఎన్ యాక్షన్ హీరో)
- బెస్ట్ యాక్షన్- పర్వేజ్ షైఖ్ (విక్రమ్ వేద)
- బెస్ట్ వీఎఫ్‌ఎక్స్- డీఎన్‌ఈజీ, రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర 1)
- లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు- ప్రేమ్ చోప్రా
- ఆర్‌డీ బర్మన్ అవార్డ్- జాన్వీ శ్రీమంకర్ (డోలిడా- గంగూబాయి కథియావాడి)
Read Also: హద్దు మీరుతున్న సమంత, చిట్టిబాబు మాటల యుద్ధం - చెవిలో వెంటుకలపై నిర్మాత రియాక్షన్