ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్  అవార్డుల ప్రదానోత్సవ వేడుక కన్నడ గడ్డపై ఘనంగా జరిగింది. సౌత్ సినీ పరిశ్రమకు చెందిన ఉత్తమ సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందజేశారు. 2020, 2021లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలకు గాను అవార్డులను ప్రదానం చేశారు.  తెలుగు నుంచి పుష్ప: ది రైజ్ సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ హీరో, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం 5 కేటగిరీలలో అవార్డులు దక్కాయి. తమిళ సినిమా పరిశ్రమ నుంచి సూరరై పొట్రు 8 కేటగిరీలలో అవార్డులను అందుకుంది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి, సానియా అయ్యప్పన్, ఐంద్రితా రేల అద్భుతమైన ప్రదర్శనల నడుమ  విజేతలను ప్రకటించడంతో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ కలర్ ఫుల్ గా మారింది.  దిగ్నాథ్, రమేష్ అరవింద్ ఈ అవార్డుల వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2022 విజేతల జాబితా ఇదే. 


తెలుగులో..


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్)- అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫీమేల్)-  సాయి పల్లవి (లవ్ స్టోరీ)


❂ ఉత్తమ చిత్రం - పుష్ప: ది రైజ్- పార్ట్ 1


❂ ఉత్తమ దర్శకుడు - సుకుమార్ బంద్రెడ్డి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(మేల్) - మురళీ శర్మ (అలా వైకుంఠపురములో)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(ఫీమేల్)) - టబు (అలా వైకుంఠపురములో)


❂ ఉత్తమ సాహిత్యం - సీతారామ శాస్త్రి - లైఫ్ ఆఫ్ రామ్ (జాను)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - సిద్ శ్రీరామ్ - శ్రీవల్లి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - ఇంద్రావతి చౌహాన్ - ఊ అంటవా (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)


❂ ఉత్తమ కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్ - రాములో రాములా (అలా వైకుంఠపురములో)


❂ ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)


❂ బెస్ట్ డెబ్యూ మేల్- పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)


❂ బెస్ట్ డెబ్యూ ఫీమేల్ - కృతి శెట్టి (ఉప్పెన)


❂ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ - అల్లు అరవింద్


తమిళంలో..


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్)- సూర్య (సూరరై పొట్రు)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫీమేల్)- లిజోమోల్ జోస్ (జై భీమ్)


❂ ఉత్తమ చిత్రం - జై భీమ్


❂ ఉత్తమ దర్శకుడు - సుధా కొంగర (సూరరై పొట్రు)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(మేల్) - పసుపతి (సర్పత్త పరంబరై)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(ఫీమేల్) - ఊర్వశి (సూరరై పొట్రు)


❂ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్(ఫీమేల్)-అపర్ణ బాలమురళి(సూరరై పొట్రు)


❂ ఉత్తమ సంగీత ఆల్బమ్ - జి వి ప్రకాష్ కుమార్ (సూరరై పొట్రు)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - క్రిస్టిన్ జోస్ మరియు గోవింద్ వసంత- ఆగసం (సూరరై పొట్రు)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - ఢీ- కట్టు పాయలే (సూరరై పొట్రు)


❂ ఉత్తమ కొరియోగ్రఫీ - దినేష్ కుమార్ - వాతి కమింగ్ (మాస్టర్)


❂ ఉత్తమ సినిమాటోగ్రఫీ - నికేత్ బొమ్మిరెడ్డి (సూరరై పొట్రు)


కన్నడలో..


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్)- ధనంజయ్ (బడవ రాస్కల్)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫీమేల్)- యజ్ఞ శెట్టి (చట్టం 1978)


❂ ఉత్తమ చిత్రం - చట్టం 1978


❂ ఉత్తమ దర్శకుడు - రాజ్ బి శెట్టి (గరుడ గమన వృషభ వాహన)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(మేల్)  - బి. సురేషా (చట్టం 1978)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(ఫీమేల్) - ఉమాశ్రీ (రత్నన్ ప్రపంచం)


❂ ఉత్తమ సంగీత ఆల్బమ్ - వాసుకి వైభవ్ (బడవ రాస్కల్)


❂ ఉత్తమ సాహిత్యం - జయంత్ కైకిని- తేలాడు ముగిలే (చట్టం 1978)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - రఘు దీక్షిత్- మలే మలే మలేయే (నిన్నా సనిహకే)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - అనురాధ భట్- ధీర సమ్మోహగార (బిచ్చుగట్టి)


❂ ఉత్తమ సినిమాటోగ్రఫీ - శ్రీషా కుడువల్లి (రత్నన్ ప్రపంచం)


❂ బెస్ట్ కొరియోగ్రఫీ - జానీ మాస్టర్ - ఫీల్ ది పవర్ (యువరత్న)


❂ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - పునీత్ రాజ్‌కుమార్


మలయాళంలో..


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్) - బిజు మీనన్ (అయ్యప్పనుం కోషియం)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫీమేల్) - నిమిషా సజయన్ (ది గ్రేట్ ఇండియన్ కిచెన్)


❂ ఉత్తమ చిత్రం - అయ్యప్పనమ్ కోషియం


❂ ఉత్తమ దర్శకుడు - సెన్నా హెగ్డే (తింకలఙ్చ నిశ్చయం)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(మేల్) - జోజు జార్జ్ (నాయట్టు)


❂ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(ఫీమేల్) - గౌరీ నంద (అయ్యప్పనుం కోషియం)


❂ ఉత్తమ సంగీత ఆల్బమ్ - ఎం. జయచంద్రన్ (సుఫియం సుజాతయుమ్)


❂ ఉత్తమ సాహిత్యం - రఫీక్ అహ్మద్ - అరియతరియతే (అయ్యప్పనుం కోషియం)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - షాహబాజ్ అమన్ - ఆకాశమయవాలే (వెల్లం)


❂ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - K.S చిత్ర-తీరమే (మాలిక్)


Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?


Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్