మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' (Ravanasura). దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ ఏడాది జనవరిలో సినిమా మొదలైంది. అప్పటినుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో రవితేజ వేరే సినిమాలతో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. 


మొదట ఈ సినిమాను హైదరాబాద్ లోనే చిత్రీకరించాలనుకున్నారు. టాకీ పార్ట్ మొత్తాన్ని హైద‌రాబాద్‌లోని రియల్, నేచురల్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఒక్క సెట్ కూడా వేయకూడదనుకున్నారు. కానీ ఇప్పుడు క్లైమాక్స్ కోసం స్పెషల్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ DRK కిరణ్ 'రావణాసుర' కోసం ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారు. 


దీనికోసం రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 


ఇందులో రాముడిగా కీలక పాత్రలో సుశాంత్ నటించనున్నారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. 


రవితేజ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:


ఇటీవల 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ప్రస్తుతం.. 'టైగర్ నాగేశ్వరావు', 'ధమాకా' సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన స్టార్స్ ను కూడా ఈ సినిమా కోసం ఆన్ బోర్డ్ చేస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ని ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు.


అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా  నిర్మిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమా కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్‌ మదీ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్