యంగ్ మోడల్, నటి ఆకాంక్ష మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం నాడు ముంబైలోని ఓ హోటల్ గదిలో ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయారు. పోలీసులు ఈ కేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. దాని ప్రకారం.. ఆకాంక్ష మోహన్ బుధవారం మధ్యాహ్నం సమయంలో ముంబై, లోఖండ్‌వాలాలోని జమునా నగర్ ఏరియాలో ఉన్న ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేశారు.
గదిలోకి వెళ్లిన ఆమె గంటలు గడుస్తున్నా.. బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే మేనేజర్ కి సమాచారం ఇచ్చారు. మేనేజర్ ఆమె గదికి పలుసార్లు ఫోన్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హోటల్ కి చేరుకున్న పోలీసులు.. ఆకాంక్ష మోహన్ రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్లారు.
అయితే అప్పటికే ఆమె ఉరేసుకొని కనిపించారు. గదిలో పోలీసులకు సూసైడ్ లెటర్ కనిపించింది. 'నన్ను క్షమించండి. నా చావుకి ఎవరూ కారణం కాదు. నేను హ్యాపీగా లేను. నాకు ప్రశాంతత కావాలి' అని సూసైడ్ లెటర్ లో రాసి ఉంది. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగానే చోటుచేసుకున్న మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ఆకాంక్ష మోహన్ మోడలింగ్ తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?
Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?