గత వారం ‘రావణాసుర’, ‘మీటర్’ సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ వారం సైతం పలు పాన్ ఇండియన్ సినిమాలతో పాటు చిన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. కొన్ని చిత్రాలు నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లలో విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇటు థియేటర్లు, అటు ఓటీటీల్లో విడుదలకాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
శాకుంతలం
సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా పాన్ ఇండియన్ మూవీ ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంతతో పాటు దేవ్ మోహన్ నటించారు. సమంత శకుంతల పాత్ర పోషించగా, దేవ్ మోహన్ దుష్యంతుడి రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టబోతోంది.
రుద్రుడు
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రుద్రుడు’. ఈ సినిమాకు కతిరేశన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.
విడుదల
‘విడుదలై’ పేరుతో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ‘విడుదల’ పేరుతో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్ 15న తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది.
ఓటీటీలో అలరించనున్న సినిమాలు
ఆహా
దాస్ కా ధమ్కీ- విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరెక్కిన ‘దాస్ కా ధమ్కీ’ ఏప్రిల్ 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కాబోతోంది. నివేదా పేతురాజ్, హైపర్ ఆది, మహేష్, రావు రమేష్, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ‘ఆహా’లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.
డిస్నీ+హాట్‌స్టార్
ఓ కల- చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన సినిమా ‘ఓ కల’. ఈ నెల 13 నుంచి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించారు. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య, రంజిత్ కుమార్, ఆదిత్య రెడ్డి నిర్మించారు. ప్రేమ ఉన్నా, ఆ విషయాన్ని చెప్పకపోవడంతో ఎంత నరకం అనుభవించాల్సి ఉంటుందో ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.
నెట్‌ఫ్లిక్స్
ఫ్లోరియా మాన్, అబ్సెషన్ అనే వెబ్ సిరీస్ లు ఏప్రిల్ 13 స్ట్రీమింగ్ కానున్నాయి.
ది లాస్ట్ కింగ్‌డమ్ అనే హాలీవుడ్ చిత్రం ఏప్రిల్ 14 విడుదల కానుంది.
అమెజాన్ ప్రైమ్
ది మార్వెలస్ మిస్సెస్ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కు రానుంది.
జీ5
రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన ‘మిస్సెస్ అండర్‌కవర్’ అనే హిందీ చిత్రం ఏప్రిల్ 14 ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Also: అందుకే ‘శాకుంతలం’ నేటితరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది : సమంత