నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా '18 పేజెస్' (18 Pages Movie). ఈ నెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.


ఫేస్‌బుక్ లేని అమ్మాయి...
18 Pages Trailer Review : '18 పేజెస్' ట్రైలర్ స్టార్టింగులో 'నీకు ఫేస్‌బుక్ లేదా?' అని నిఖిల్ అడుగుతాడు. 'లేదు' అని అనుపమా పరమేశ్వరన్ ఆన్సర్ ఇస్తారు. ఆ ఒక్క సంభాషణలో స్టోరీ, కాన్సెప్ట్ ఏంటి? అనేది చెప్పేశారు. ఈ రోజుల్లో ఫేస్‌బుక్ లేని అమ్మాయి ఉంటుందా? అనే క్వశ్చన్ రావడం కామన్. అయితే, ఫేస్‌బుక్ లేకుండా ప్రేమలో పడితే ఎలా ఉంటుందో? అనే ఊహ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 


ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని హీరోలో మొదలైన ఆసక్తి తర్వాత ప్రేమగా మారుతుంది. ప్రేమతో పాటు సినిమాలో యాక్షన్ కూడా ఉందని ట్రైలర్ ద్వారా చెప్పారు. ఇదొక ఎమోషనల్ లవ్ డ్రామా అని అర్థం అవుతోంది. 'ప్రేమించడానికి మనకి ఇక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నాం? అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు' అని అనుపమ చెప్పే మాట అందరినీ ఆకట్టుకుంటుంది. 


Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు



సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై '18 పేజెస్' చిత్రాన్ని 'బన్నీ' వాస్ నిర్మించారు. సుకుమార్ అందించిన కథతో రూపొందిన చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ సినిమాలో పాటలు విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఏడు రంగుల వాన...'ను ఈ మధ్య విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. అంతకు ముందు శింబు పాడిన బ్రేకప్ సాంగ్ కూడా వైరల్ అయ్యింది.


జానపద గాయకుడు తిరుపతి మెట్ల రాయడంతో పాటు స్వయంగా పాడిన 'నీ వల్ల ఓ పిల్ల' పాటను ఇటీవల విడుదల చేశారు. ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మధ్య వస్తున్న ప్రేమ కథలకు భిన్నమైన కథతో ఈ సినిమా రూపొందిందని పాటలు, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 


'కార్తికేయ 2' తర్వాత మరోసారి!
'18 పేజెస్' సినిమాలో నిఖిల్ సరసన నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే. '18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం!


హీరో హీరోయిన్ల హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!


Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?