టాలీవుడ్ యంగ్ హీరో  నిఖిల్ మంచి ఫాంలో ఉన్నాడు. గత కొంత కాలంగా అదిరిపోయే హిట్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ‘కార్తికేయ-2’తో దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా స్థాయిలో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా '18 పేజెస్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 11 కోట్ల గ్రాస్ సాధించింది.

  


మూడు రోజుల్లో రూ. 11 కోట్లు


నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘18 పేజెస్’ చిత్రానికి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు.  సుకుమార్ కథ అందించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్తో కలిసి బన్నీ వాసు నిర్మించారు.  ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల రూపాయలను సంపాదించింది. నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లు వసూలు అయ్యాయి. తెలంగాణ, ఏపీలో కలిసి రూ. 10 కోట్లు వసూళు అయ్యాయి. ఓవరాల్ గా రూ. 11 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.






తొలి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు


'18 పేజెస్' సినిమా తొలి రోజు కంటే రెండు, మూడో రోజు ఎక్కువగా వసూళ్లు సాధించడం విశేషం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు  1.22 కోట్ల షేర్ వసూలు చేసింది. రెండవ రోజు 1.06 కోట్లు వచ్చాయి. కానీ, మూడవ రోజు  1.45 కోట్లు వసూలు చేసింది.   


విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్


ఇక సినిమా విడుదలకు ముందే ’18 పేజెస్’ చిత్రానికి మంచి బిజినెస్ దక్కింది. నాన్ థియేట్రికల్  రైట్స్ ద్వారా ఈ సినిమా దాదాపు రూ. 6 కోట్ల వరకు సంపాదించింది. ఇతర భాషల్లో డబ్బింగ్ రైట్స్ కూడా బాగా ధర పలికాయి. నిఖిల్ సినిమాలు వరుసగా విజయవంతం కావడంతో ఇతర  రాష్ట్రాల్లో డబ్బింగ్ హక్కులను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు.    


Read Also: షారుఖ్ ‘పఠాన్’ అరుదైన గుర్తింపు, ఆ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే!