12th Fail Movie OTT Streaming: సినిమాలో స్టఫ్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే దానికి బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘12th ఫెయిల్‌’ మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగించింది. రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మనోజ్ కుమార్ అనే IAS అధికారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విక్రాంత్ మన్సే ప్రధాన పాత్ర పోషించారు. విధు వినోద్ చోప్రా ఈ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు.


ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ‘12th ఫెయిల్’


అక్టోబర్ 27న ‘12th ఫెయిల్‌’ సినిమా థియేటర్లలోకి అడుగు పెట్టింది. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు వినోద్. అంతేకాదు, సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యూ విద్యార్థుల వెతలను కూడా ఇందులో ప్రస్తావించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల హృదయాలను కదిలించేలా ఉంది ఈ చిత్రం.


ఓటీలోకి వచ్చేసిన  ‘12th ఫెయిల్’


థియేటర్లలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్న ఈ ఇన్‌స్పైరింగ్‌ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ బయోపిక్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్ 29 నుంచి ‘12th ఫెయిల్‌’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.     






అనురాగ్ పాఠ‌క్ న‌వ‌ల ఆధారంగా తెరకెక్కిన  ‘12th ఫెయిల్’


అనురాగ్ పాఠ‌క్ రాసిన న‌వ‌ల ఆధారంగా ‘12th ఫెయిల్’ సినిమా తీశారు దర్శకుడు విధు వినోద్ చోప్రా. ఈ  సినిమాలో మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించాడు. 12వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ అయిన ఆయన  జీవితాన్ని గడపడం కోసం ఆటో డ్రైవర్‌గా మారుతాడు. అయితే, IAS అధికారి కావాలనే తన కలను మాత్రం మర్చిపోడు. చివరకు ఆ ఆటో డ్రైవర్‌ IASగా ఎలా మారాడు అనేది చాలా ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు. ‘12th ఫెయిల్’ సినిమా ఆస్కార్స్‌ కు ఇండిపెండెంట్ నామినేష‌న్ కింద వెళ్లినా షార్ట్ లిస్ట్ కాలేదు. ఈ చిత్రంలో మేధా శంకర్‌, అనంత్ జోషి, అన్షుమాన్‌ పుష్కర్‌, ప్రియాంషు చటర్జీ, గీతా అగర్వాల్‌, హరీష్‌ ఖన్నా, సరితా జోషి కీలక పాత్రలు పోషించారు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌ బ్యార్ లో విధు వినోద్‌ చోప్రా, యోగేష్‌ ఈశ్వర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.  


Read Also: సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?