Alzheimers : మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని మనందరికీ తెలిసిందే. బయటకు కనిపించే శరీర భాగాలను మనం బాగానే చూసుకున్నప్పటికీ.. శరీరం లోపలి భాగాల సంగతి పట్టించుకోము. స్కానింగ్ చేస్తే తప్పా శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియదు. కడుపులో అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. కడుపులో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. మంచి బ్యాక్టీరియా గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ కొన్ని బగ్స్ వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా ఆధ్యయనం పేర్కొంది.


గట్ బ్యాక్టీరియా అల్జీమర్స్ వ్యాధికి కారణం అవుతుందా?


ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిలో కనిపించే సాధారణ గట్ బ్యాక్టీరియా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం గురించి పూర్తి సమాచారాన్ని  అల్జీమర్స్ & డిమెన్షియా: ది జర్నల్ ఆఫ్ ది అల్జీమర్స్ అసోసియేషన్‌లో ప్రచురించింది. వైద్యపరంగా స్పష్టంగా కనిపించే హెలికోబాక్టర్ పైలోరీ (H pylori) ఇన్‌ఫెక్షన్ 50 ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందా అనే అంశంపై పరిశోధన చేసింది. పొట్టలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నట్లయితే.. అజీర్ణం, పొట్టలో పుండ్లు, అల్సర్లు పేగు లేదా పొట్ట క్యాన్సర్ కు కారణం అవుతాయని అధ్యయనం పేర్కొంది. 


H. పైలోరీ ఇన్‌ఫెక్షన్:


మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం, 1988, 2019 మధ్య 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని 4 మిలియన్ల మంది వ్యక్తుల ఆరోగ్య డేటాను సేకరించింది. రోగ లక్షణ H. పైలోరీ ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తులకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 11 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని, జనాభా పెరుగుతున్నా ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. “ప్రపంచ వృద్ధాప్య జనాభా దృష్ట్యా, వచ్చే 40 ఏళ్లలో మతిమరుపు సమస్య మూడు రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.


అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే ఆహారం: 


మరొక అధ్యయనంలో, అల్జీమర్స్ వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో ఏ ఆహారం ప్రభావంతంగా ఉంటుందో పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురించారు. మెడిటరేనియన్ ఆహారం, సాంప్రదాయ చైనీస్, జపనీస్, భారతీయ వంటకాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలు ముఖ్యంగా పాశ్చాత్య ఆహారంతో పోల్చినప్పుడు ప్రమాదాన్ని తగ్గించగలవని అధ్యయనం తెలిపింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ,ఊబకాయం  మధుమేహం ప్రమాదాన్ని పెంచడంతోపాటు అల్జీమర్స్ కు కారణం అవుతాయని అధ్యయనం పేర్కొంది. 


Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.