Peeleru Assembly Constituency: పీలేరులో మూడోసారి విజయం సాధించేది ఎవరో..? 

Peeleru Assembly Constituency: పీలేరు నియోజకవర్గం 1965లో ఏర్పడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు విభజనలో వెళ్లింది.

Continues below advertisement

Andhra Pradesh News: పీలేరు నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రశాంత రాజకీయం జరుగుతుందని అన్ని పార్టీల నాయకులు చెప్పే మాట. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నాయకులు ఏ పార్టీ వైపు మగ్గు చూపుతారో వేచి చూడాలి ఉంది. ఒక నాయకుడు మూడోసారి విజయం సాధించాలని చూస్తుంటే... మరో నాయకుడు మూడోసారి అయిన విజేతగా నిలవాలని ఉన్నారు.

Continues below advertisement

పీలేరు నియోజకవర్గం 1965లో ఏర్పడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు విభజనలో వెళ్లింది. పీలేరు శాసన సభ నియోజకవర్గం రాజంపేట లోక్ సభ పరిధిలోకి వస్తుంది.  ఇందులో పీలేరు, వాల్మీకిపురం (వాయల్పడు), గుర్రంకొండ, కలికిరి, కలకడ, కంభంవారిపల్లి మండలాలు ఉన్నాయి.

మూడోసారి విజయం సాధించాలని

ప్రస్తుతం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. రాష్ట్ర విభజనకు ముందు ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిపై గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అదే ప్రత్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై రెండోసారి విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థి ప్రకటన చేయలేదు. ఆయన తరువాత ఆ స్థాయి నాయకులు లేరని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడని.. తప్పకుండా ఆయనకే సీటు ఇస్తారని అంటున్నారు. ఆయనకే సీటు ఇస్తే మూడోసారి ఎమ్మెల్యే అవుతారా.. 

వాల్మీకిపురంలో సాయిబాబా ఆలయం నిర్మించిన ఎమ్మెల్యే... ట్రస్ట్ తరపున నిత్య అన్నదానం, వైద్య శిబిరాలు వంటి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రచారం ఉంది. గత 4 ఏళ్లుగా గ్రామస్థాయిలో ఆయన పేరు చెప్పి అనుచరులు కబ్జాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారు వెయ్యి కోట్ల మేర ప్రభుత్వ భూముల అమ్మకాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా తీరుపై ప్రజలు అసహనం ఉందని అంటున్నారు. 

కుటుంబ వారసత్వం ఫలించేనా

పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబ అంటే తెలియని వారు ఉండరు. ప్రజలు అందరిని పేరు పెట్టి పిలిచి మరీ మాట్లాడే చనువుగా ఉంటారని అంటారు. వీరి కుటుంబం రాజకీయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పీలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. తరువాత టీడీపీలో చేరిన అదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మూడోసారి అయిన విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని  ఇప్పటికే ప్రకటించారు.

ముస్లిం ప్రభావం ఎక్కువ

ఈ నియోజకవర్గంలో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తారు. 2సార్లు గెలిచిన వైసీపీకి... ఈసారి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందా అని చర్చ నడుస్తోంది. నియోజకవర్గంలో జనసేన ప్రభావం స్వల్పంగా ఉంటుంది. మరోవైపు బీజేపీతో పొత్తు అదే పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం కలిసి వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయిు. 

Continues below advertisement