Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పౌరులు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రజలను కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని, తద్వారా సరైన నాయకులకు ఓటు వేసి మన భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని అన్ని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. 


How To cast your vote in Telangana - తొలిసారి ఓటు వేస్తున్నవారికి ఓటు వేసే విధానంపై కొన్ని సందేహాలు ఉంటాయి. మొదట మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవాలి. అనంతరం మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకుంటే నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎలక్షన్ కమీషన్ వెబ్‌సైట్ లేదా సీ విజిల్ యాప్ లో ఆ వివరాలు చెక్ చేసుకోవాలని ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర గాడ్జెట్లను అనుమతించరు. కనుక వాటిని ఇంటి వద్ద పెట్టి ఓటు వేయడానికి వెళ్లడం బెటర్.


(Voting Process at Polling Booth) పోలింగ్ బూత్ వద్ద ఓటింగ్ ప్రక్రియ ఇలా..



  • పోలింగ్ బూత్ లో మొదటగా పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి, మీ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు

  • రెండో పోలింగ్ అధికారి మీ వేలికి సిరా వేస్తారు. ఓటర్ స్లిప్ ఇచ్చి, రిజిస్టర్‌పై మీతో సంతకం చేయిస్తారు. (ఫారం 17A)

  • పోలింగ్ బూత్ లో మూడో పోలింగ్ అధికారికి ఓటర్ స్లిప్‌ ఇవ్వాలి. ఇంక్ వేసిన మీ వేలిని చూపించిన తరువాత పోలింగ్ బూత్‌ లోపలికి వెళ్లాలి.

  • ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)లో మీకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్యాలెట్ బటన్‌ (ballot button)ను నొక్కితే  ఓటు నమోదు అవుతుంది. బీప్ శబ్దం సైతం వినిపిస్తుంది.

  • వీవీప్యాట్ మెషీన్ (VVPAT Machine) విండోలో కనిపించే స్లిప్‌ను చూడండి. VVPAT బాక్స్‌లో పడే ముందు అభ్యర్థి సీరియల్ నెంబర్, పేరు, గుర్తుతో కూడిన స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది.

  • ఈవీఎంలో మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే మీరు నోటా (NOTA)ను క్లిక్ చేయాలి. ఇది EVMలో చివరి బటన్ గా ఉంటుంది.


మీకు మరింత సమాచారం కావాలంటే అధికారిక వెబ్ సైట్ http://ecisveep.nic.in/లో ఓటర్ గైడ్‌ చెక్ చేసుకోవచ్చు.


నవంబర్ 30వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల ముగియనుంది. అయితే 5లోపు పోలీంగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. తెలంగాణ అసెంబ్లీ 119 నియోజకవర్గాలకు ఒకేదశలో ఓటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ చేసి విజేతలను ప్రకటిస్తారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply