SIR Process In Andhra Pradesh and Telangana 2026: బిగ్ అలర్ట్ ఫోక్స్‌! మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఓటరా? అయితే మీకో షాకింగ్ న్యూస్. గత 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల్లో ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. ఎప్పుడో 2002-2004 కాలంలో జరిగిన స్పషల్ ఇన్టెస్టివ్‌ రివిజన్ ప్రక్రియను మళ్లీ ఇప్పుడు 2026లో అఫీషియల్‌గా రీ-స్టార్ట్ చేశారు. అంటే మీ ఓటర్ ఐడీ కార్డు కేవలం మీ జేబులో ఉంటే సరిపోదు, ఈ సరి కొత్త సర్వేలో మీ వివరాలు మ్యాచ్ అవ్వకపోతే మీ ఓటు లిస్ట్‌ నుంచి గల్లంతు కావడం ఖాయం. 

Continues below advertisement

ఇది ఒక సాధారణ రొటీన్ అప్‌డేట్ కాదు. ఇదొక ఎలక్ట్రోరల్ ఎర్త్‌క్వేక్‌. రెండు రాష్ట్రాల్లో కలిసి లక్షలాది మంది ఓట్లపై ప్రస్తుతం సందిగ్దత నెలకొంది. దాదాపు లక్షల మంది ఓట్లు డేంజర్‌ జోన్‌లో పడ్డాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో అన్‌మ్యాప్డ్‌ ఓటర్లను అధికారులు గుర్తించారు. అసలు ఈ 24 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సవరణ ఏంటీ ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టింది? ఓటు కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. 

అసలు ఏంటీ ఈ సర్‌

సాధారణంగా ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరిస్తుంది. దీనిని సమ్మరీ రివిజన్ అంటారు. కానీ గత రెండు దశాబ్ధాలుగా ఓటర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోవడం, ఒక వ్యక్తికి రెండు మూడు ప్రాంతాల్లో ఓటు హ్కు ఉండటం వల్ల డేటాబేస్ గందరగోళంగా మారింది. 

Continues below advertisement

దీనిని ప్రక్షాళన చేసేందుకు 2002లో చివరిసారిగా దేశవ్యాప్తంగా సర్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సమగ్ర గ్రౌండ్‌ లెవెల్ సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రక్రియ పూర్తి చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు సర్వే ప్రారంభించారు. ప్రస్తుతం 2026లో ఎన్నికల సంఘం 2002 ఎలక్టోరల్ రోల్‌ను కీ రిఫరెన్శ్‌గా తీసుకొని ఇప్పటి 2026 డేటాతో కంప్యూట్, మాన్యువల్‌ మ్యాపింగ్ చేస్తోంది. 

30శాతం మిస్‌మ్యాచ్‌- డేంజర్‌ జోన్‌లో ఓట్లు 

ఎన్నికల సంఘం అధికారులు ప్రాథమికంగా జరిపిన మ్యాపింగ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను కంపేర్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం మంది మిస్‌ మ్యాచ్ అయ్యారు. ఒక్క తెలంగాణలోనే దాదాపు రెండు కోట్ల ఓట్లు అన్‌మ్యాపింగ్, లోపాలు ఉన్నట్టు గుర్తించారు. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను వంద శాతం పారదర్శకంగా తొలిగించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. 

మీ ఇంటికే రానున్న BLOs

ఈ సవరణ కోసం ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో భారీ సైన్యాన్ని రంగంలోకి దించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 46,397 మంది తెలంగాణలో వేలాది మంది బూత్‌లెవల్ ఆఫీసర్స్‌ను నియమించారు. వారంతా ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. 

మీ వద్దకు వచ్చే బీఎల్‌వోలు ప్రత్యేకమైన యునిక్‌ ఎన్యూమరేన్ పామ్ తీసుకొస్తారు. ఇందులో మీ ప్రస్తుత వివరాలు ప్రింట్ అయి ఉంటాయి. ఒక వేళ మీరు మొదటి విజిట్‌లో ఇంట్లో లేకపోతే, బీఎల్‌వోలు కనీసం మూడుసార్లు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు. మీ 2002నాటి ఓటు వివరాలతో ప్రస్తుత వివరాలు లింక్ కాకపోతే, మీకు EROs నుంచి అధికారికంగా నోటీసులు వస్తాయి. అప్పటికీ స్పందించకపోతే మీ ఓటు తొలగిస్తారు. 

2002లో మీ ఓటు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి?

ఈ సర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియలో అర్బన్ ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించింది. voters.eci.gov.inng సిటిజన్ సర్వీస్‌ పోర్టల్ ద్వారా మీరు మీ పాత రికార్డులను వెతకవచ్చు. ఇంటర్నెట్‌ బ్రౌజర్‌లో https://voters.eci.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. హోంపేజీలో నిపిస్తున్న search your name in last SIR అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, 2002లో మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ వివరాలను ఎంటర్ చేయండి. మీ పేరు, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం నంబరు వంటి వివరాలు వస్తాయి. ఆ వివరాలను మీ ఏరియా బీఎల్‌వోకి అందిస్తే మ్యాపింగ్ విజయవంతం అవుతుంది. 

ఈ ప్రక్రియ షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. జూన్ 15 నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రక్రియ అక్టోబర్ నాటికి ముగిసి, సరికొత్త ప్యూరిఫైడ్ ఓట్ లిస్ట్ బయటకు రానుంది. 

కీలక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్‌ తెలంగాణలో షెడ్యూల్‌ 
ఇంటింటి సర్వే ప్రారంభం  జూన్ 15, 2026   జూన్ 25, 2026

బీఎల్‌వోల వెరిఫికేషన్ 

జులై 14, 2026   జులై 24, 2026 
డ్రాఫ్ట్ రోల్స్ సిద్ధం    జులై 21, 2026   ఆగస్టు 01, 2026
అభ్యంతరాల స్వీకరణ    జులై- ఆగస్టు 2026    ఆగస్టు సెప్టెంబర్‌ 2026
తుది ఓటర్ల జాబితా అక్టోబర్‌01, 2026  అక్టోబర్ చివరి నాటికి