SIR 2026: భారత్ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చడానికి ప్రత్యేక సమగ్ర సవరణ SIR-2026 కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను వెరిఫై చేస్తున్నారు. 

Continues below advertisement

ఓటర్ల జాబితాలో పేరు ఉండి, మరణించిన వారు, లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్‌ ఓట్లను ఏరివేయడం ద్వారా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. అంతేకాకుండా 18ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గుర్తించి వారిని జాబితాలో చేర్చడం కూడా ఇందులో భాగమే. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మీ నియోజకవర్గాల్లో బూత్‌ స్థాయి అధికారులు మీ ఇంటికి వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో 25 నుంచి ప్రారంభంకానుంది. ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా అధికారులు కనీసం రెండు మూడు సార్లు మీ ఇంటిని సందర్శించే అవకాశం ఉంది. సమయం వృథా కాకుండా ఉండాలంటే ముందుగానే సమాచారాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. 

Continues below advertisement

BLO ఇంటికి వచ్చినప్పుడు ఏం అడుగుతారు?

మీ ఇంటికి వచ్చే BLO ప్రధానంగా ఓటరు కార్డు నంబర్‌, కుటుంబ సభ్యుల సంఖ్యను అడుగుతారు. కుటుంబంలో ఎవరికైనా త్వరలో 18 ఏళ్లు నిండబోతున్నాయా అన్న వివరాలు కూడా వారు సేకరిస్తారు. వివాహం వల్ల లేదా ఉద్యోగం వల్ల ఎవరైనా ఇల్లు మారారా, లేదా మరణించారా అన్న సమాచారం అడుగుతారు. గత రికార్డుల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని గురించి సరి చేయడానికి వారు మీకు సహకరిస్తారు. మీ పాత వివరాలు అంటే 2002-2004 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉందా అనే అంశాన్ని కూడా వారు తనిఖీ చేయవచ్చు. 

ఏయే డాక్యుమెంట్స్ అవసరం

సర్వే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఇంటిలోని అందరు ఓటర్ల ఒరిజినల్‌కార్డులు లేదా కలర్ జిరాక్స్‌ కాపీలు సిద్ధం చేసుకోవాలి. దీని కోసం బర్త్ సర్టిఫికెట్‌ పదో తరగతి మెమో, పాస్‌పోర్ట్‌ లేదా పాన్ కార్డు సమర్పించవచ్చు. కరెంట్‌ బిల్లు, వాటర్‌ బిల్లు, గ్యాస్ రశీదు లేదా బ్యాంక్‌ పాస్‌బుక్ ఉపయోగించవచ్చు. ఆదార్‌ కార్డును కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే అంగీకరిస్తారు. దానిని DOBగా లేదా అడ్రెస్‌ ప్రూఫ్‌గా తీసుకోరు. 

ఏ పామ్‌లు నింపాలి

BLO మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక ఎన్యుమరేషన్ఫామ్ ఇస్తారు. అందులో అడిగిన వివరాలు తప్పుల్లేకుండా ఫిల్ చేయాలి. మీకు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలంటే ఫామ్‌-6 నింపాలి. మీ ఓటరు కార్డులో పేరు, వయసు, లేదా ఫొటో వంటి తప్పులు సరి చేయడానికి ఫామ్‌-8 నింపాలి. ఎవరైనా చనిపోయినా, డూప్లికేట్‌ ఓటును తొలగించాలన్నా ఫామ్‌-7ను సమర్పించాలి. ఈ ఫారాలను నింపేటప్పుడు కేవలం క్యాపిటల్‌ లెటర్స్‌ మాత్రమే వాడాలి. పేరు మీ టెన్త్‌క్లాస్‌ మెమో లేదా ఆధార్‌లో ఉన్న విధంగానే కచ్చితంగా ఉండేలా చూసుకోండి. 

డిజిటల్ వెసులుబాటు 

మీరు ఆఫ్‌లైన్‌లో వెయిట్ చేయకూడదనుకుంటే, నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ voter.eci.gov.inద్వారా కూడా సర్వే పూర్తి చేయవచ్చు. లేదా ECI/Voter Helpline App ద్వారా మొబైల్‌లోనే మీ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.