ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. భాజపాతో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధినేత జయంత్ చౌదరీ. ఎన్నికల అనంతరం భాజపాతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని జయంత్ చౌదరీ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ఆర్‌ఎల్‌డీతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నట్లు భాజపా సంకేతాలిస్తోంది. జయంత్ చౌదరీ ప్రకటనతో వీటికి ఫుల్ స్టాప్ పడింది.
మరో జాబితా..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మరో జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. ఇందులో 91 మంది పేర్లు ఉన్నాయి. ఈసారి మొత్తం 13 మంది మంత్రులకు టికెట్లు కేటాయించగా అయోధ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్లీ అవకాశం ఇచ్చింది.
మరో మంత్రి ముకుత్ బిహారీ వర్మకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. కానీ ఆయన కుమారుడు గౌరవ్‌ను కైసర్‌గంజ్ స్థానం నుంచి బరిలోకి దింపుతోంది.
సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు శలబ్ మణి త్రిపాఠికి దేవరియా స్థానం కేటాయించారు.
అయోధ్య నుంచి సీఎం ఆదిత్యనాథ్ పోటీ చేస్తారని ప్రచారం వచ్చినప్పటికీ తొలి జాబితాలోనే గోరఖ్‌పుర్ స్థానం నుంచి యోగిని బరిలోకి దింపింది పార్టీ. దీంతో అయోధ్య స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తాకే ఇచ్చారు.
మిగిలిన మంత్రులు..
- సిద్ధార్థ్ నాథ్ సింగ్ - పశ్చిమ అల్‌హాబాద్
- నంది గోపాల్ గుప్తా - దక్షిణ అల్‌హాబాద్
- వ్యవసాయ మంత్రి సూర్య ప్రతాప్ శశికి కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.
Also Read: PM Narendra Modi: ట్రెండ్ మార్చిన మోదీ.. ఈసారి నల్ల కళ్లద్దాలు, తలపాగా.. పంజాబ్ కోసమే!