Telangana Results 2023: తెలంగాణలో ఎన్నికల్లో చాలా మంది మంత్రులు పట్టు కోల్పోతున్నారు. ఓటమి దిశగా పయనిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మరికొందరు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.  కాంగ్రెస్ హవా ముందు చాలా మంది మంత్రులు వెనుకంజలోకి వెళ్లారు. అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంల కొనసాగుతున్నారు. 


మరో మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందుంజలో దూసుకెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు దగ్గర నుంచి తుమ్మల హవా కొనసాగుతోంది. 


వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి టి మేఘా రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 
ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వి రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. 


ధర్మపురిలో పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. తన ప్రత్యర్థి లక్ష్మణ్‌ కుమార్ ముందంజలో ఉన్నారు. 
బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రశాంత్ రెడ్డి కూడా ఓటమి దిశగా వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ దూసుకెళ్తున్నారు. 


మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్‌ కూడా వెనుకంజలో ఉన్నారు.