Rangareddy  Assembly Election Results 2023  constituencies wise winners and losers : రంగారెడ్డి జిల్లాలో ఫలితాలు చూస్తే బీఆర్‌ఎస్‌ జోరు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కారు దూసుకెళ్లింది. 14 స్థానాలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో మూడంటే మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చూపగలిగారు. మిగతా 11 స్థానాల్లో మాత్రం కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. చంద్రబాబు అరెస్టు లాంటి అంశాలతో ఇక్కడ కారుకు స్పీడ్‌ బ్రేకర్లు ఉంటాయని అంతా భావించారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కారు తన పట్టు నిలుపుకునేట్టు కనిపిస్తోంది.


షాద్‌ నగర్‌ నియోజకవర్గం (రంగా రెడ్డి జిల్లా)
షాద్ నగర్ నియోజకవర్గంలో 2023 లో కాంగ్రెస్ అభ్యర్థి కె.శంకరయ్య విజయం సాధించారు.  2018  షాద్‌నగర్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్‌ రెండోసారి గెలిచారు. తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్‌ రెడ్డిపై  20556 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జనరల్‌ సీటుగా మారిన షాద్‌నగర్‌ నుంచి 2009 లో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధి ప్రతాప్‌రెడ్డి పోటీచేసి గెలుపొందినా, 2014లో ఓడిపోయారు. టిఆర్‌ఎస్‌ నేత అంజయ్యయాదవ్‌ తన ప్రత్యర్ధి ప్రతాపరెడ్డిని 17328 మెజార్టీతో ఓడించారు.


కొడంగల్‌ నియోజకవర్గం
కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ...కామారెడ్డిలో ఓడినా ఇక్కడ గెలుపొందారు. సమీప BRS అభ్యర్థి పట్నం నాగేందర్ పై విజయం సాధించారు.  కొడంగల్‌ నియోజకవర్గంలో 2018 లో TRS  అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్‌ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌ రెడ్డిపై 9319 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.  రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నియోజకవర్గంలో 2014లో...సీనియర్‌ నేత  గురునాధరెడ్డిని 14614 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు.


తాండూరు నియోజకవర్గం
2023 లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి.మనోహర్ రెడ్డి విజయం సాధించారు.  (కాంగ్రెస్) 2018 లో తెలంగాణ వ్యాప్తంగా TRS  గాలివీస్తే తాండూరులో మాత్రం 2018 ఎన్నికల సమయం వరకు మంత్రిగా ఉన్న మహేందర్‌ రెడ్డి ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది పైలట్‌ రోహిత్‌ రెడ్డి విజయం సాధించారు. రోహిత్‌కు  2875 ఓట్ల ఆధిక్యత లభించింది. 
2014లో మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ది, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుపై  15982 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు మూడుసార్లు TDP పక్షాన గెలుపొందగా 2014లో  TRS‌లోకి వెళ్లి గెలిచారు. 


వికారాబాద్‌ (ఎస్సి) నియోజకవర్గం
వికారాబాద్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో 2023 లో గడ్డం ప్రసాద్ కుమార్ TRS అభ్యర్ది డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పై విజయం సాధించారు.  2018 లో TRS అభ్యర్ది డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ప్రసాదకుమార్‌పై 3122 ఓట్ల మెజార్టీతో గెలిచారు.  2014లో  ప్రసాదకుమార్‌ కాంగ్రెస్‌ ఐ తరుపున పోటీచేసి టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి బి.సంజీవరావు చేతిలో ఓడిపోయారు. 10072 ఓట్ల ఆదిక్యతతో సంజీవరావు విజయం సాధించారు. 


పరిగి నియోజకవర్గం
 2023  - పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు.  2018 లో పరిగి నియోజకవర్గంలో TRS  పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్‌ రెడ్డి విజయం సాధించారు. ఆయన సీనియర్‌ నేత కొప్పుల హరీశ్వర్‌ రెడ్డి కుమారుడు. మహేష్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, సిటింగ్‌ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌ రెడ్డిపై 16400 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహేశ్వర్‌రెడ్డికి 82941 ఓట్లు రాగా, రామ్మోహన్‌ రెడ్డికి 66541 ఓట్లు వచ్చాయి. 
2014 లో పరిగి నియోజకవర్గంలో ఐదుసార్లు గెలుపొందిన సీనియర్‌ నేత హరీశ్వర్‌ రెడ్డి 2014లో  టిఆర్‌ఎస్‌ తరపున పోటీచేసి ఓడిపోవడం విశేషం. కాంగ్రెస్‌ ఐ తరపున పోటీచేసి టి.రామ్మోహన్‌ రెడ్డి చేతిలో హరీశ్వర్‌ రెడ్డి 5163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 


చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గం
2023 - చేవెళ్ల నియోజక వర్గంలో బీఆర్ఎస్ నుంచి కాలె యాదయ్య, బీజేపీ నుంచి కె. ఎస్, రత్నం, బీఎస్పీ నుంచి రాజా మహేంద్ర వర్మ, కాంగ్రెస్ నుంచి బీమ్ భరత్ పమేనా పోటీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వెనక్కి నెట్టేసి BRS అభ్యర్థి కాలె యాదయ్య భారీ  మెజార్టీతో గెలుపొందారు. 2018 లో చేవెళ్ల రిజర్వుడు నియోజకవర్గంలో TRS అభ్యర్ధి కాలె యాదయ్య మరోసారి గెలిచారు. సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి కె.ఎస్‌. రత్నంపై 33747 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో యాదయ్య కాంగ్రెస్‌  టిక్కెట్‌ పై గెలిచి, ఆ తర్వాత కాలంలో TRS లో చేరారు. తిరిగి TRS తరపున 2018లో పోటీచేసి 
విజయం సాదించారు. కాలె యాదయ్యకు 98701 ఓట్లు రాగా,కె.ఎస్‌  రత్నంకు 64954 ఓట్లు వచ్చాయి.


శేరీలింగంపల్లి నియోజకవర్గం
2023-  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరికెపూడి గాంధీ భారీ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌పై దాదాపు 45 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.                                                                                                                                                                                                                                      2018 లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి TRS  అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాంధీ విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్‌ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
2014లో గాంధీ TDP, BJP కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత TRS లో చేరిపోయారు. గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్‌ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్‌ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు.


రాజేంద్ర నగర్‌ నియోజకవర్గం
2023 - రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి తొల్కంటి ప్రకాశ్ గౌడ్ విజయం సాధించారు.  2018లో రాజేంద్ర నగర్‌ నియోజకవర్గం నుంచి TRS అభ్యర్ధిగా పోటీచేసిన టి.ప్రకాష్‌ గౌడ్‌ తన సమీప TDP ప్రత్యర్ది గణేష్‌ గుప్తపై 57331 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రకాష్‌ గౌడ్‌కు 106676 ఓట్లు రాగా, గణేష్‌ గుప్తాకు 49345 ఓట్లు వచ్చాయి.
2014లో కాంగ్రెస్‌ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన జ్ఞానేశ్వర్‌పై 25881 ఓట్ల తేడాతో  టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా ప్రకాష్‌ గౌడ్‌ విజయం  సాధించారు. 


మహేశ్వరం నియోజకవర్గం
2023 - మహేశ్వరం నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి  సబితా ఇంద్రారెడ్డి  కాంగ్రెస్  అభ్యర్థి  కిచెన్నగారి లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. 
2018 లో మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగోసారి విజయం సాధించారు. సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 9227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ పక్షాన గెలిచినా, ఆ తర్వాత TRS లో చేరిపోయారు
2014లో మహేశ్వరం నుంచి TDP పక్షాన  గెలిచిన తీగల కృష్ణారెడ్డి కూడా ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ లో చేరారు..కాంగ్రెస్ అభ్యర్ధి ఎమ్‌.రంగారెడ్డిపై 30784 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 


ఎల్బి నగర్‌ నియోజకవర్గం
2023 -  ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలిచారు.  2018 లోనూ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్‌ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది రామ్మోహన్‌ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్‌ రెడ్డి 2009లో మొదటి సారి గెలవగా, 2018లో  రెండో సారి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు.
2014లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన బిసి సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య ఎల్బినగర్‌ నియోజకవర్గంలో అనూహ్య విజయం సాధించారు.  ప్రత్యర్ధి రామ్మోహన్‌ గౌడ్‌పై 12525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు.


ఉప్పల్‌ నియోజకవర్గం
2018 ఉప్పల్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి TRS అభ్యర్ధిగా పోటీచేసిన బి.సుభాష్‌ రెడ్డి సమీప టిడిపి ప్రత్యర్ది వీరేందర్‌ గౌడ్‌ పై48232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
2014లో ఉప్పల్‌ నియోజకవర్గంలో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. ప్రభాకర్‌ 14169 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు.


కూకట్‌ పల్లి నియోజకవర్గం
2023-  కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఘన విజయం సాధించారు. మొత్తం 64 వేల పైచిలుకు ఓట్లతో ఆయన గెలిచారు. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉండగా, జనసేన పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.  2018 లో కూకట్‌పల్లి నియోజకవర్గంలో TRS  అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు దివంగత TDP నేత నందమూరి హరికృష్ణ కుమార్తె, TDP అభ్యర్ధి నందమూరి సుహాసినిపై ఘన విజయం సాదించారు. మాదవరం కృష్ణారావు 41049 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
2014లో  మాధవరం కృష్ణారావు  43186 ఓట్ల ఆదిక్యతతో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గొట్టుముక్కల పద్మారావుపై  విజయం సాధించారు. ఆ తర్వాత కృష్ణారావు TRS లో చేరిపోయారు


కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం


2023 - కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి కె.పి.వివేకానంద గౌడ్...కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంతరెడ్డిపై విజయం సాధించారు . 2018 లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన వివేకానందగౌడ్‌  గెలిచారు. సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ మీద 41500 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. 
2014లో వివేకానంద గౌడ్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె.హనుమంతరెడ్డిపై 39021 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 


మల్కాజిగిరి నియోజకవర్గం
2023-  మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2018 లో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి TRS  అభ్యర్దిగా పోటీచేసిన మైనంపల్లి హనుమంతరావు ఘన విజయం సాదించారు.  సమీప బిజెపి ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావుపై 73698 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 
2014 ఎన్నికలో  తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ది కనకారెడ్డి  బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుపై విజయం సాధించారు. కనకారెడ్డికి 2768 ఓట్ల ఆదిక్యత వచ్చింది.


మేడ్చల్‌ నియోజకవర్గం


2023 - మేడ్చల్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి  చామకూర మల్లారెడ్...కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ పై విజయం సాధించారు. 2018 లో మేడ్చల్‌  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చామకూర మల్లారెడ్డి గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆయన మల్కాజిగిరిలో టిడిపి పక్షాన ఎమ్‌.పిగా గెలిచి ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.  సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 88066 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.