Telangana Polling 2023 : తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సందడి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రావ దగ్గర క్యూ కట్టారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ, ఇతర అధికారులు కూడా ఓట్లు వేయడానికి తరలివస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓ లెక్క..హైదరాబాద్ ఒక్కటి మరోలెక్క అన్నట్టు పరిస్థితి మారింది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తక్కువే నమోదయ్యేట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా అతి తక్కువ ఓటింగ్ హైదరాబాద్ లోనే కావడంతో ఈ డిస్కషన్ జరుగుతోంది.
హాలిడే రిలక్సయ్యేందుకు కాదు - ఓటేయడానికి
ఎన్నికల రోజును ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తున్నాయి. అయినా ఓటేసేందుకు ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. బారెడు పొద్దెక్కినా ఏదో వీకెండ్ రోజు రిలాక్సవుతున్నట్టు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. ఇల్లు కదలనివారు కొందరైతే...హాలిడే వచ్చిందంటూ సొంత పనులు చూసుకుంటున్నవారు మరికొందరు. సెలవు ప్రకటించి మరీ ఓటేయమంటే భాగ్యనగర వాసుల తీరు ఇలా ఉంది
Also Read: సాగర్ వద్ద కొనసాగుతున్న టెన్షన్, ప్రాజెక్టు గేట్లు ఏపీ పోలీసులు స్వాధీనం!
బాధ్యతలేదా!
భాగ్యనగర ఓటర్ల తీరును కొందరు నెటిజన్లు ఎండగడుతున్నారు. తెల్లారితే నీళ్లు రావడం లేదు, రోడ్లు బాలేవు, ఈ సమస్య ఆ సమస్య అంటూ హడావుడి చేసేవారంతా తన బాధ్యతను నిర్వర్తించే రోజు వచ్చేసరికి మాత్రం బద్ధకం చూపిస్తున్నారంటున్నారు. ఉదయం 11 గంటలు గడిచినా హైదరాబాద్ లో కేవలం 12 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది...
Also Read: నాగార్జున సాగర్ టెన్షన్స్‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు
ఉదయం 9 గంటల వరకూ హైదరాబాద్ లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది
- హైదరాబాద్ లో అత్యల్పంగా నాంపల్లిలో 0.5 శాతం
- సనత్ నగర్ లో 0.2 శాతం
- కూకట్పల్లిలో 1.9 శాతం
- మేడ్చల్లో 2 శాతం
- గోషామహల్ లో 2 శాతం
- చార్మినార్లో 3 శాతం
- ముషీరాబాద్ లో 4 శాతం
- రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదయ్యింది.
Also Read: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
పట్టణ ప్రాంతాల్లో దారుణంగా ఓటింగ్ - కవిత
అర్బన్ ఓటింగ్ చాలా దారుణంగా ఉంటోందని కల్వకుంట్ల కవిత అన్నారు. పట్టణ ఓటర్లు కచ్చితంగా పోలింగ్ బూత్ కు రావాలని పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ మెరుగ్గా ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాల్లో చాలా దారుణంగా ఉందని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం కాగా ఆ తర్వాత ఘర్షణల వాతావరణం హోరెత్తింది. జనగామ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనగామ జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల 245 పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం రేగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో ఉండడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో లాఠీలకు పని చెప్పి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply