Nizamabad Assembly Election Results 2023  constituencies wise winners and losers : నిజామాబాద్‌ జిల్లా 9 నియోజకవర్గాలు(ఆర్మూరు, బోధన్,జుక్కల్‌,బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ , బాల్కొండ, కామారెడ్డి )


నిజామాబాద్‌లో జిల్లాలో విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఆధిక్యంలో ప్రదర్శిస్తోంది. ఇక్కడ రెండో స్థానం కోసం బీఆర్ఎస్‌, బీజేపీ పోటీ పడుతున్నారు. 9 స్థానాలు ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంటే... చెరో రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి.


ఆర్మూరు (నిజామాబాద్‌ జిల్లా)
2023 లో ఆర్మూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి  విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2014, 18లో ఆశన్నగారి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్ నేత, ఇప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఆకుల లలితపై 28795 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జీవన్‌ రెడ్డికి 72125 ఓట్లు, లలితకు 43330 ఓట్లు వచ్చాయి. 2014లో మాజీ  స్పీకర్‌ కె.ఆర్‌.సురేష్‌ రెడ్డిని ఓడించారు. తర్వాత 2018లో సురేష్‌ రెడ్డి కారు ఎక్కారు. ఎంపీ అయ్యారు.


బోధన్ నియోజకవర్గం


2023 లో బోధన్ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థి  పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గెలుపొందారు.  బోధన్‌లో 2014, 18లో కారు జోరు సాగింది. ఆ పార్టీ తరఫున షకీల్‌ అహ్మద్‌ రెండుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ నేత సుదర్శనరెడ్డిని ఓడించారు. 8101 ఓట్ల తేడాతో షకీల్‌ అహ్మద్‌ గెలిచారు. షకీల్‌కు 74895 ఓట్లు రాగా, సుదర్శనరెడ్డికి 66794 ఓట్లు వచ్చాయి.


జుక్కల్‌(ఎస్సీ)
జుక్కల్‌ నియోజకవర్గంలో 2023 లో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావు..BRS అభ్యర్థి హన్మంత్ షిండేపై విజేతగా నిలిచారు.  గత మూడు దఫాలుగా హనుమంతు షిండే గెలుస్తూ వస్తున్నారు. ఒకసారి టీడీపీ తరఫున మరో రెండసార్లు బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. ఆఖరి రెండుసార్లు ఆయన ప్రత్యర్థి మాత్రం కాంగ్రెస్‌ నేత ఎస్‌.గంగారామ్‌. షిండేకి 41959 ఓట్ల మెజార్టీ వచ్చింది.


బాన్సువాడ నియోజకవర్గం
2023 లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి...కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై గెలిచారు.  సీనియర్‌ నేత పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్స్‌వాడ అడ్డగా ఉండేది. ఆయన ఇక్కడి నుంచి ఆరుసార్లుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గతంలో మంత్రిగా పని చేసిన పోచారం 2018లో స్పీకర్‌ పదవి చేపట్టారు. బాన్స్‌వాడ నుంచి పోచారం 1994, 1999, 2009, 2014, 2018లో విజయం సాధించారు. పోచారం ప్రత్యర్ది కాంగ్రెస్ నేత బాలరాజ్‌పై 18485 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పోచారానికి 77343 ఓట్లు రాగా, బాలరాజ్‌కు 59458 ఓట్లు వచ్చాయి.


ఎల్లారెడ్డి నియోజకవర్గం
2023 లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావ్ .... BRS అభ్యర్థి జాజల సురేందర్ పై గెలుపొందారు.  2018లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి జాజుల సురేందర్‌ 35148 ఓట్ల తేడాతో గెలిచారు. సురేందర్‌కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. ఆయన తర్వాత గులాబీ కండువా కప్పుకోవడంతో ఏనుగ రవీంద్ర బయటకు వచ్చేశారు. 


నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం
నిజామాబాద్ అర్బన్ సీటు బీజేపీ వశం అయింది.  ఈ నియోజకవర్గం నుంచి దన్‌పాల్ సూర్య నారాయణ...BRS అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా పై గెలుపొందారు . గతంలో ఈ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసిన గణేష్‌ బిగాల 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్‌ నేత తాహిర్‌ బిన్‌ హమదాన్‌పై 26055 ఓట్ల ఆధిక్యత సాధించారు. 


నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం
2023 నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన రేకులపల్లి భూపతి రెడ్డి .... BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ పై గెలిచారు.  నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన అంతకుముందు ఒకసారి ఆర్మూరులోను, మరోసారి బాన్స్‌వాడలోను గెలిచారు. 2014 ఎన్నికల ముందు అనూహ్యమైన రీతిలో బాజిరెడ్డి గోవర్దన్‌ టిఆర్‌ఎస్‌లో చేరి కాంగ్రెస్‌ నేత డి.శ్రీనివాస్‌ను ఓడించారు. తిరిగి మరోసారి కాంగ్రెస్‌ నేత భూపతి రెడ్డిపై 25655 ఓట్ల మెజార్టీతో గెలిచారు.


బాల్కొండ నియోజకవర్గం
బాల్కొండ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ తరపున 2సార్లు గెలిచిన BRS అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి 2023 లో మరోసారి గెలిచారు.  2014లో గెలిచిన తర్వాత మిషన్‌ భగీరథ స్కీమ్‌ అమలు చైర్మన్‌గా ఉన్నారు. ఇక్కడ బిఎస్పి తరపున పోటీచేసిన సునీల్‌ కుమార్‌ను ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున అనిల్‌ కుమార్‌ 2014, 2018లో పోటీ పడ్డారు.


కామారెడ్డి నియోజకవర్గం
కామారెడ్డి నియోజక వర్గం 2023లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంటకరమణ రెడ్డి గెలుపు ఇంట్రెస్టింగ్.  ఇదే నియోజక వర్గంలో BRS నుంచి  కేసీఆర్ , కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. మొదట్నుంచీ కేసీఆర్ మూడో స్థానంలో ఉండగా...రేవంత్ రెడ్డి ఓ దశలో లీడింగ్ లోకి వచ్చారు.. ఫైనల్ గా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ గెలిచారు.  కామారెడ్డి నియోజకవర్గంలో 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున గంప గోవర్దన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ పోటీ పడ్డారు. గోవర్దన్‌ 4557 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గోవర్దన్‌ కు 68162 ఓట్లు రాగా, షబ్బీర్‌ అలీకి 63610 ఓట్లు వచ్చాయి.