Nalgonda Assembly Election Results 2023 constituencies wise winners and losers : నల్లొండ జిల్లా వ్యాప్తంగా 2023 ఎన్నికలలో గెలిచిన, ఓడిన అభ్యర్థుల జాబితా ఇక్కడ చూడొచ్చు. 2018, 2014 ఎన్నికల్లో ఎవరెవరు పోటీపడ్డారు.. ఎవరెంత ఆధిక్యంతో గెలిచారో పూర్తి వివరాలివే..
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం
2023 లో దేవరకొండ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో
2018 లో BRS అభ్యర్థిగా పోటీచేసిన ఆర్.రవీంద్ర కుమార్ గెలిచారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌పై 38848 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు.
2014లో కాంగ్రెస్ ఐ తో పొత్తు పెట్టుకున్న CPI తెలంగాణ లో దేవరకొండ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో రమావత్ రవీంద్ర కుమార్ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు
నాగార్జున సాగర్ నియోజకవర్గం
2023 లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కె.జయవీర్ రెడ్డి...BRS అభ్యర్థి నోముల భగత్ పై విజయం సాధించారు.
2018లో BRS అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై గెలిచారు
కొంతకాలానికి ఆయన నోముల నరసింహయ్య కన్నుమూయడంతో జరిగిన ఉపఎన్నికలో నోమలు భగత్ ను BRS బరిలోకి దించింది. జానారెడ్డిపై భగత్ 18872 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మిర్యాలగూడ నియోజకవర్గం
2023 లో మిర్యాలగూడ నియోజకవర్గంలో
2018 లో BRS అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు తమ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై 30652 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2014 లో కాంగ్రెస్ తరఫున విజయంసాధించిన నల్లమోతు భాస్కరరావు ఆ తర్వాత BRS లో చేరారు.
హుజూర్‌నగర్ నియోజకవర్గం
2023 లో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘనవిజయం సాధించారు. BRS అభ్యర్థి సైదిరెడ్డిపై 47వేల ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు
2018లో లోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప టిఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై 7466 ఓట్ల ఆధిక్యం సాధించారు
2019లో ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభకు ఎన్నిక కాగా, హుజూర్ నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలో BRS అభ్యర్ది సైదిరెడ్డి భారీ ఆధిక్యం సాధించగా..ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు
2014 ఎన్నికల తర్వాత ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు
కోదాడ నియోజకవర్గం
2023 - కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నలమడ పద్మావతి రెడ్డి..BRS అభ్యర్థిపై గెలిచారు
2018లో - కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి...BRS అభ్యర్థి మల్లయ్యయాదవ్‌కు చేతిలో ఓటమిపాలయ్యారు.
2014లో నల్లమాడ పద్మావతి తన సమీప ప్రత్యర్ధి.. టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ది మల్లయ్య యాదవ్‌పై విజయం సాధించారు
సూర్యాపేట నియోజకవర్గం
2023 - సూర్యాపేట నియోజవర్గంలో
2018 - BRS తరపున పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి...సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. దామోదరరెడ్డిపై 5941 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు
2014 - జగదీష్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంక టేశ్వరరావుపై 2219 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
నల్గొండ నియోజకవర్గం
2023 - నల్లగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి...సమీప BRS అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి పై గెలిచారు
2018 -BRS అభ్యర్ధిగా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి..కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 23698 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు
1999 నుంచి ఇక్కడ నుంచి వరసగా గెలుస్తున్న కోమటిరెడ్డి 2018లో ఓటమి చెందారు..మళ్లీ 2023 లో విజయం సాధించారు
మునుగోడు నియోజకవర్గం
2023 లో మనుదోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. సమీప BRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గెలిచారు
2018 - కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..BRS అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు.
2014 - BRS అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడించారు.
భువనగిరి నియోజకవర్గం
2023 - భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్తి కుంభం అనిల్ కుమార్ రెడ్డి...BRS అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి పై గెలిచారు
2018 - TRS నుంచి పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి...సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆధిక్యత సాధించారు
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం
2023 లో నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీచేసిన వేముల వీరేశం.. BRS అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై గెలిచారు
2018- కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చిరుమర్తి లింగయ్య ...సమీప BRS అభ్యర్థి వేముల వీరేశంపై 8259 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఆ తర్వాత కొద్ది కాలానికి లింగయ్య కాంగ్రెస్ ఐకి గుడ్ బై చెప్పి అదికార BRS లో చేరారు.
2014- BRS అభ్యర్థి వేముల వీరేశం..కాంగ్రెస్ అభ్యర్ది చిరుమర్తి లింగయ్యను 2370 ఓట్ల తేడాతో ఓడించారు
తుంగతుర్తి నియోజకవర్గం
2023 - తుంగతుర్తి రిజర్వుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల శామ్యూల్ గెలిచారు
2018 - విద్యార్ది నేత గాదరి కిషోర్ కాంగ్రెస్ అభ్యర్ది అద్దంకి దయాకర్ ను ఓడించారు. కిషోర్ కు 1847 ఓట్ల ఆధిక్యత వచ్చింది.
2014 - కిషోర్, దయాకర్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.కిషోర్ 2379 ఓట్ల ఆధిక్యతతో దయాకర్ పై గెలుపొందారు.