Adilabad Assembly Election Results 2023  constituencies wise winners and losers from


ఆదిలాబాద్‌ జిల్లా (బోథ్‌, ఆదిలాబాద్‌, ఖానాపూర్, ముథోల్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు)


ఆదిలాబాద్‌ లాంటి బాగా వెనుకబడిన జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ మాత్రం రెండంటే రెండు స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. ఓవరాల్‌గా 10 స్థానాలు ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ తలో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంటే... బీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది


ముథోల్‌ నియోజకవర్గం
ముథోల్‌ నియోజకవర్గంలో విఠల్ రెడ్డి రెండుసార్లుగా విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో బిజెపి నేత రమాదేవీపై 43364 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది. విఠల్‌ రెడ్డి 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి విజయం సాధించిన తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. విఠల్‌ రెడ్డి తండ్రి గడ్డెన్న ముదోల్‌ నుంచి గతంలో ఆరుసార్లు విజయం సాధించారు.


నిర్మల్‌ నియోజకవర్గం
ఇక్కడ 2014 నుంచి విజయం సాధిస్తున్న ఇంద్రకరణ్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2018లో సమీప ప్రత్యర్ది మహేష్‌రెడ్డిపై 9271 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014లో బిఎస్పి తరఫున పోటీ చేసి విజయం సాధించి కారు ఎక్కారు. కారు ఎక్కంగానే మంత్రి అయ్యారు. 2018లో ఇంద్రకరణ్‌ రెడ్డికి 79985 ఓట్లు రాగా, మహేష్‌ రెడ్డికి 70714 ఓట్లు వచ్చాయి. 2014లో ఇంద్రకరణ్‌ రెడ్డి  8497 ఓట్ల మెజార్టీ సాధించారు.


బోథ్(ఎస్టీ) నియోజకవర్గం
బోథ్‌లో గత ఎన్నికల్లో బాపూరావు బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సోయం బాపూరావుపై 6639 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. సోయం బాపూరావు 2009లో బీఆర్‌ఎస్‌ తరపున విజయం సాధించి 2014లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


ఖానాపూర్‌(ఎస్టీ) నియోజకవర్గం
గత ఎన్నికల్లో ఖానాపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ తరఫున లేఖానాయక్‌ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రమేష్‌రాథోడ్‌పై గెలుపొందారు. రేఖా నాయక్‌కు 66974 ఓట్లు వస్తే, రమేష్‌ రాథోడ్‌కు 45928 ఓట్లు వచ్చాయి. 21046 ఓట్ల ఆధిక్యంతో రేఖా నాయక్‌ విజయం సాధించారు. 2014లో  ఖానాపూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ నుంచి అజ్మీరా రేఖ పోటీ చేసి గెలుపొందారు. టిడిపి మాజీ  ఎమ్మెల్యే రమేష్‌ రాథోడ్‌ కుమారుడు పోటీ రితేష్‌ రాథోడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆజ్మీరా రేఖ తొలిసారిగా 38511 ఓట్ల ఆధిక్యతతో  అసెంబ్లీలో అడుగు పెట్టారు.


మంచిర్యాల నియోజకవర్గం
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్‌సాగర్‌రావు దండ యాత్ర చేశారు. ఆయనపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్‌.దివాకరరావు గెలుస్తూనే వచ్చారు. 2018లో ప్రేమ్‌ సాగరరావుపై దివాకరరావు 4877 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. 2014లో దివాకరరావు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ 2014లో బీఆర్‌ఎస్‌నేత అరవింద్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి భారీ  ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన దివాకర్‌ భారీ విజయం సొంతం చేసుకున్నారు. 2014 కంటే ముందు దివాకరరావు లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు.


బెల్లంపల్లి(ఎస్సీ) నియోజకవర్గం
బెల్లంపల్లి రిజర్వుడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా  దుర్గం చిన్నయ్య ఉన్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా బీఆర్‌ఎస్‌ తరఫున విజయం సాధించారు. 2014 ఎన్నకిల్లో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌ను, 2018లో మాజీ మంత్రి జి.వినోద్‌ ను ఓడించి గెలుపొందారు. చిన్నయ్యకు 11276 ఓట్ల  మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు వచ్చాయి.


చెన్నూరు(ఎస్సీ) నియోజకవర్గం
ఎస్సీకి రిజర్వైన చెన్నూరులో నియోజకవర్గంలో 2009 నుంచి బీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. అంత ముందుకు ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టు ఉండేది. అయితే బీఆర్‌ఎస్‌ రంగప్రవేశంతో టీడీపీ పట్టుకోల్పోయింది. ఇక్కడ 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన బల్క సుమన్ గెలుపొందారు. ఆయన 2014లో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. తర్వాత 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొర్లకుంట వెంకటేష్‌పై విజయం 28126 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత వెంకటేష్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో బీఆర్‌ఎస్‌ నేత నల్లాల ఓదేలు హ్యాట్రిక్‌ కొట్టారు. ఆయన మాజీ మంత్రి వినోద్‌పై విజయం సాధించారు. 1962లో ఏర్పడిన చెన్నూరు అప్పటి నుంచి రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌ ఐదుసార్లు గెలిస్తే...  టీడీపీ ఐదుసార్లు, బీఆర్‌ఎస్‌ మూడుసార్లు విజయం సాధించింది.