పోస్టల్ బ్యాలెట్‌లో లీడీంగ్‌ ఉన్నట్టు కనిపించినా బండి సంజయ్‌ కరీంనగర్‌లో వెనుకంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 2,232 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. షాద్ నగర్ లో 4 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి శంకరయ్య 2,586 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభ అనిల్ కుమార్ రెడ్డి నాలుగో రౌండ్ ముగిసే సమయానికి 3,873 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.


కరీంనగర్‌ జిల్లాలో కూడా కారుకు ఎదురుగాలి తప్పడం లేదు. ఈ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండబోదని అంతా అనుకున్నారు కానీ... ఇక్కడ కాంగ్రెస్ పుంజుకుంది. 13 స్థానాల్లో పోటీ జరిగితే నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ దూసుకెళ్తోంది.