MLA Durgam Chinnaiah violated model code of conduct: ఎల్లపల్లి: ఎన్నికల వేళ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదుతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు కావడంతో ఓటు వేసేందుకు ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపెల్లిలో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. పార్టీ కండువాతోనే వచ్చి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి. పార్టీ కండువా ధరించి మంత్రి ఇంద్రకరణ్ ఓటు వేశారని అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో వివాదంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ కండువాతో వచ్చి ఓటు వేయడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. పార్టీ కండువాతో వచ్చిన దుర్గం చిన్నయ్యకు ఎన్నికల సిబ్బంది అభ్యంతరం చెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల అధికారుల తీరు సరికాదంటున్నారు. మరోవైపు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేయనున్నారు.
ఓటు వేసేందుకు వచ్చి ఇద్దరు మృతి..హైదరాబాద్ లాంటి చోట్ల తక్కువ ఓటింగ్ నమోదవుతుండగా.. జిల్లాల్లో మాత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు ఆదిలాబాద్ లో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావల గ్రామానికి చెందిన తోకల గంగమ్మ (78) పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. అదే సమయంలో ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. భుక్తాపుర్ గ్రామానికి చెందిన రాజన్న అనే 65 ఏళ్ల వృద్ధుడు ఓటేసేందుకు క్యూ లైన్లో నిల్చున్నారు. అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయిన ఆయనను రిమ్స్‌కు తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే రాజన్న ప్రాణాలు కోల్పోయారు.
మధ్యాహ్నం 3 గంటల వరకూ తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89
| వరుస సంఖ్య | జిల్లా పేరు | పోలింగ్ శాతం |
| 1 | ఆదిలాబాద్ | 62.3% |
| 2 | భద్రాద్రి | 58.3% |
| 3 | హైదరాబాద్ | 31.1% |
| 4 | జగిత్యాల | 58.6% |
| 5 | జనగామ | 62.2% |
| 6 | భూపాలపల్లి | 64.3% |
| 7 | గద్వాల | 64.4% |
| 8 | కామారెడ్డి | 59% |
| 9 | కరీంనగర్ | 56% |
| 10 | ఖమ్మం | 63.6% |
| 11 | కుమరంభీం | 59.6% |
| 12 | మహబూబ్ నగర్ | 65% |
| 13 | మంచిర్యాల | 59.1% |
| 14 | మెదక్ | 69.3% |
| 15 | మేడ్చల్ మల్కాజిగిరి | 38.2% |
| 16 | ములుగు | 67.8% |
| 17 | నాగర్ కర్నూల్ | 57.5% |
| 18 | నల్గొండ | 59.9% |
| 19 | నిజామాబాద్ | 56.5% |
| నారాయణపేట | 57.1% | |
| 20 | నిర్మల్ | 60.3% |
| 21 | పెద్దపల్లి | 59.2% |
| 22 | రాజన్న సిరిసిల్ల | 56.6% |
| 23 | రంగారెడ్డి | 42.4% |
| 24 | సంగారెడ్డి | 56.2% |
| 25 | సిద్దిపేట | 64.9% |
| 26 | సూర్యాపేట | 62% |
| 27 | వికారాబాద్ | 57.6% |
| 28 | వనపర్తి | 60% |
| 29 | వరంగల్ | 52.2% |
| 30 | యాదాద్రి భువనగిరి | 64% |
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply