బీఆర్ఎస్ లో జనగామ అసెంబ్లీ టికెట్ వ్యవహారంలో రోజురోజుకు ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటలయుద్ధం కొనసాగుతోంది. టికెట్ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి...తగ్గేదే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. టికెట్ విషయంలో పోటీ వస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విమర్శల జోరు పెంచారు. అక్క జయప్రదకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు లాక్కొని...ఆమెను మానసిక వేదనకు గురి చేశావంటూ మండిపడ్డారు. 


జనగామ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేస్తూ...పార్టీని మలినం చేస్తున్నారని ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సొంత ఖర్చులతో భోజనాలు పెట్టించి గెలిపించానన్నారు. 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పడం సిగ్గు చేటన్నారు. కబర్ధార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. 


ముత్తిరెడ్డి. జనగామ ప్రజలతో సంబంధం లేని వ్యక్తివి...సేవ ఎలా చేస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను భూకబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే...ప్రాణత్యాగానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గం మీద.. స్థానిక నాయకుల మీద సోయి లేని నువ్వు... నియోజక వర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తావంటూ మండిపడ్డారు. 


రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్...జనగాం అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించనున్నారు. ఈ టైంలో ముత్తిరెడ్డి...పల్లాను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్...ముత్తిరెడ్డి పిలిపించుకొని నచ్చజెప్పాలని నిర్ణయించారు. ముందు పార్టీ నేతలను పంపించి మాట్లాడనున్నారు. అప్పటికి వినకపోతే...కేసీఆర్ స్వయంగా మాట్లాడి...వివాదానికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.