తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం జరుగుతున్నా ఆచి తూచి అడుగులు వేస్తోంది. నిన్న  గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెయ్యికిపైగా  ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. వీటితో... దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో మొదటి జాబితా రిలీజ్‌ చేసేందుకు  కసరత్తు చేస్తున్నారు. 


కాంగ్రెస్‌ పార్టీ మొదటి జాబితా ఈనెల 22న రిలీజ్ అవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 40 మంది అభ్యర్థులతో జాబితా ఉంటుందని సమాచారం. కాంపిటిషన్ లేని  నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. తొలి జాబితాలో సీనియర్​ నాయకుల పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. నిన్న  గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో 40 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికై ఏకాభిప్రాయం కుదిరింది.. మిగితా స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు, అంతకంటే  ఎక్కువ మంది పోటీ ఉండటంతో ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మరోసారి భేటీ అయ్యి చర్చించనుంది కమిటీ. 


ఈ నెల 20న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ తర్వాత లిస్టును రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈనెల 19నే ఢిల్లీలో స్క్రీనింగ్ మీటింగ్ పెట్టాలని భావించినప్పటికీ..  పార్లమెంట్ సమావేశాలు, సీడబ్ల్యూసీ మీటింగ్, తెలంగాణలో సోనియా సభ ఉండటంతో ఒక రోజు ఆలస్యంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్  తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ఫైనల్‌ చేయనున్నారు. అభ్యర్థుల ప్రకటన ఇప్పటికే ఆలస్యమైందని నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో... కాంగ్రెస్‌ పార్టీ  తొందరపడుతోంది. మరో 10 రోజులు అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.


కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠగా మారింది. ఈ జాబితాలో దాదాపు సీనియర్ల పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి దాదాపు ఖరారైన అభ్యర్థులు జాబితాలో నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్‌నగర్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, వికారాబాద్‌ నుంచి గడ్డం ప్రసాద్‌కుమార్‌, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్‌కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి టి.రామ్మోహన్‌రెడ్డి ఉండే అవకాశం ఉంది. 


కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్టు ఉండే నేతలు వీరే..?
అలాగే.. నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, ములుగు నుంచి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి వంశీచంద్‌రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, షాద్‌నగర్ నుంచి ఈర్లపల్లి శంకర్, కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి, అలంపూర్ నుంచి సంపత్‌కుమార్, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ నుంచి ఎ.చంద్రశేఖర్, నర్సాపూర్ నుంచి గాలి అనిల్‌కుమార్‌, నిర్మల్ నుంచి శ్రీహరిరావు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, జుక్కల్ నుంచి గంగారాం, కామారెడ్డి నుంచి షబ్బీర్‌అలీ ఉంటారని సమాచారం. మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య, కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంథని నుంచి శ్రీధర్‌బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, హుజురాబాద్ నుంచి బల్మూరి వెంకట్, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం నుంచి రాజ్‌ఠాకూర్, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, ధర్మపురి నుంచి లక్ష్మణ్, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్‌రావును ఫైనల్‌ చేసినట్టు సమాచారం.