Aswaraopeta Election Result: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం కాంగ్రెస్ పార్టీ నమోదు చేసింది. తొలి ఫలితం అశ్వారావుపేట నియోజకవర్గం (Aswaraopeta Election Result) నుంచి వెలువడింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఈయన విజయం సాధించారు. దాదాపు 28 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు అక్కడ గెలిచారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.


ఇల్లెందు కూడా కాంగ్రెస్ దే..


అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు (ఎస్టీ) నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, తన సమీప ప్రత్యర్థి అయిన, బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ పై గెలుపొందారు.