Famous leaders to cast their votes in these polling stations: హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం గురువారం ఉదయం చింతమడకకు వెళ్తున్నారు. చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం ఉదయం 7.30 గంటలకు SR నగర్‌లో నారాయణ జూనియర్ కళాశాల, పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో కుటుంబ సమేతంగా ఓటు వేయనున్నారు. మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.



  • కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లోని zphsలోని పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు.

  • ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేయనున్నారు.

  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుబ్దరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు.

  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో వేయనున్నారు.

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో Both No - 160లో ఓటు వేయనున్నారు. 

  • ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ఓటు వేయనున్నారు.

  • ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వడా గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు.

  • సీతక్క ఎమ్మెల్యే ములుగు మండలంలోని జగ్గన్నపేటలో ఓటు వేయనున్నారు 


సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ బరిలోకి దిగారు. తన నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి సైతం ఈటల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సవాల్‌ విసిరారు. కోడంగల్ నుంచి సైతం రేవంత్ పోటీ చేస్తున్నారు.


Also Read: Voting Procedure: ఇలా చేస్తే మీరు ఓటు వేసినా నో యూజ్‌! - పర్ఫెక్ట్ ఓటింగ్‌కి ఈ సూచనలు పాటించండి


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply