Assembly Elections Polling 2026:ఏప్రిల్ 23 గురువారం నాడు దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలు అయిన తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  . బెంగాల్‌ మొదటి విడతలో 152 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఈ రెండు రాష్ట్రాలతోపాటు అసోం, పుదుచ్చేరీ, కేరళ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

Continues below advertisement

తమిళనాడులో ప్రస్తుతం అధికారం డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య పోటీ నెలకొంది. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రాకతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తం 5. 73 కోట్ల మంది ఓటర్లు 4, 023 మంది అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చనున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సుమారు 3.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నాలుగోసారి అధికారంలోకి రావాల లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 77 స్థానాలతో బలపడిన బీజేపీ నౌ ఆర్ నెవర్ అన్న రీతిలో పోరాడుతోంది. 

Continues below advertisement

2021 ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలను గెలుచుకొని చారిత్రాత్మక విజయం సాధించింది. లక్ష్మీ బండార్ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను టీఎంసీ వైపు తిప్పడంలో కీలకంగా మారాయి. మరోవైపు తమిళనాడులో 2021లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. స్ఠాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి ఓట్ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 234 నియోజకవర్గాల్లో 215 చోట్ల మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. 

తమిళనాడులో కీలక అభ్యర్థులు

ఎంకేస్టాలిన్- కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్- తిరువల్లికేణి స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు విజయ్‌- టీవీకే పార్టీ తరఫున తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్‌ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 

ఎడప్పాడి పళనిస్వామి- ఎడప్పాడి నియోజకవర్గం నుంచి నాలుగో సారి విజయం సాధించాలని భావిస్తున్నారు. పన్నీర్ సెల్వం- ఆయన డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో బిగ్ హెడ్స్‌

మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. బీజేపీ తరఫున నువేందు అధికకారి, సుకాంత మజుందార్‌, సమిక్ భట్టాచార్య వంటి నేతలు ప్రచారాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్, సీపీఎం కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. 

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తరలిస్తున్న వెయ్యి కోట్ల నగదు, మద్యం ఇతర వస్తువులను బెంగాల్, తమిళనాడులో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో స్పందించేలా వేలకుపైగా ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలను రంగంలోకి దించారు. రాత్రి వేళల్లో వాహనాల కదలికలపై ఆంక్షలు విధించారు.మోటార్ సైకిల్ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు.