Munugode Congress :   మునుగోడు ఉపఎన్నిక వ్యూహంపై ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి సమావేశాలు ప్రాంభించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు బోసు రాజు ఇతర తెలంగాణ నేతలతో విస్తృత మంతనాలు జరుపుతున్నారు. అభ్యర్థి సలహా పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి మునుగోడు విషయంలో క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అజాదీ కా అమృత్ గౌరవ్ అనే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. పదహారో తేదీ నుంచి ఈ పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ పరిధిలో బహిరంగసభ నిర్వహించారు. 


టీఆర్ఎస్, బీజేపీ కుట్రల వల్లే మునుగోడు ఉప ఎన్నిక


టీఆర్ఎస్, బీజేపీ కూడబలుక్కుని ఉపఎన్నిక తీసుకు వచ్చాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. ఎలాంటి ఒప్పందం లేకుండా రాజగోపాల్ రెడ్డి రాజీనామా లే్ఖ ఇచ్చిన ఐదు నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.  ఎన్నికలకు అంత అర్జెంట్ ఏముందని అన్నారు. హుజురాబాద్ ఎన్నిక టీఆర్ఎస్‌కు అవసరమని... మునుగోడు ఎన్నిక బీజేపీకి అవసరమని అన్నారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటుంన్నారని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 


ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !


కాంగ్రెస్ టిక్కెట్ కోసం పెరుగుతున్న ఆశావహులు


మరో వైపు కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టిక్కెట్ కోసం డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. బీసీలకు టిక్కెట్ ఇవ్వాలని  సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ వద్దని.. ఇలా ఇస్తే పాత వారితో సమస్యలు వస్తాయన్నారు. మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోనే ఉపఎన్నికల స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించారు. అభ్యర్థి విషయంలో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. అయినా మధుయాష్కీ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థి విషయంలో మునుగోడు సీనియర్ నేత పాల్వాయి స్రవంతి ఆడియోటేప్ కలకలం రేపింది.  కృష్ణారెడ్డి అనే మరో నేతలకూ టిక్కెట్ ఇస్తే తీవ్ర నిర్ణయం తీసుకుంటానని ఆమె ఆ ఆడియో టేపులో హెచ్చరించారు.


తెలంగాణ బీజేపీకి కొత్త ఇంచార్జ్‌గా సునీన్ బన్సల్ - ఈయన ట్రాక్ రికార్డుకి ఓ రేంజ్


కాంగ్రెస్‌లో బయటకు వస్తున్న అంతర్గత ప్రజాస్వామ్యం పోకడలు


మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తి మీదసాములా మారే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఉప ఎన్నికలు తెచ్చారన్న అంశంపై స్పష్టత ఉన్నా ఆ పార్ట నేతలు తమదైన మార్క్ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బయటకే ప్రదర్శిస్తూ ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కృషి చేస్తున్నారు.