telangana congress cm oath : తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో ( LD Stadiam )  జరగనున్న తన ప్రమాణస్వీకారానికి ప్రజలంతా రావాలని బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.


లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.                                                                                         


కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?                       


ఎం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  సీఎం ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం కారణంగా గురువారం ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌యి.  దాదాపు ల‌క్ష మంది స‌భ‌కు హాజ‌రు కావొచ్చ‌ు.  ఎల్‌బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌక‌ర్యం ఉంద‌న్నారు. మిగ‌తా జ‌నం కోసం స్టేడియం బ‌య‌ట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ అడ్వయిజరీని పోలీసులు విడుదల చేశారు.                                       


ముఖ్యంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాదారులు ట్రాపిక్ అడ్వయిజరీని గుర్తించాల్సిఉంది.  ఎల్బీ స్టేడియం, లక్డీకాపూల్ సహా పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులుచెబుతున్నారు.