Rampachodavaram Assembly constituency: తూర్పు గోదావరి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం రంపచోడవరం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్‌, ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, గడిచిన రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2,25,007 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,11,274 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,13,721 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు అధికంగా ఉండి గెలుపును ప్రభావితం చేయనున్నారు. 


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలు


ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సార్లు ఇక్కడ విజయాలను దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో తొలిసారి 1962లో ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన చోడి మల్లిఖార్జున విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన కె రామిరెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు. 410 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన చోడి మల్లిఖార్జున మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన కారం బాపన్న దొరపై 3,330 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన టి రత్నబాయి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జి ప్రకాశరావుపై 8837 ఓట్ల తేడాతో గెలుపొందారు. 


1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గొర్రెల ప్రకాశరావు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన టి రత్నాబాయిపై 14,194 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం జోగారావు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గొర్రెల ప్రకాశరావుపై 5293 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం జోగారావు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన గొర్రెల ప్రకాశరావుపై 9690 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌ వెంకటేశ్వరరావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన టి రత్నాబాయిపై 2866 ఓట్ల తేడాతో గెలుపొందారు.


1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌ వెంకటేశ్వరరావు విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కారం సావిత్రిపై 8007 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నంబాబూ రమేష్‌ విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పి వెంకటరమణారెడ్డిపై 6673 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె సత్యనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం బాబూ రమేష్‌పై 10,803 ఓట్ల తేడాతో గెలుపొందారు.


2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వి రాజేశ్వరి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్‌ వెంకటేశ్వరరావుపై 6673 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నాగులపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన వంతల రాజేవ్వరిపై 39,106 ఓట్ల తేడాతో గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది. ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మరోసారి తలపడే అవకాశముందని చెబుతున్నారు. చూడాలి మరి ఇరు పార్టీలు అభ్యర్థులను మార్చి బరిలోకి దిగుతాయా..? పాత వారికే అవకాశాలను కల్పిస్తాయో.