పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం తొలిసారి స్పందించింది. పంజాబ్ ఫతేఘర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడారు.
పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కెప్టెన్ అమరీందర్ సింగ్ నిరాకరించారు. విద్యుత్ పంపిణీ సంస్థలతో తనకు ఒప్పందాలున్నాయని అందుకే ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అంగీకరించనని అమరీందర్ అన్నారు. అందుకే ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాల్సి వచ్చింది. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
నవజోత్ సింగ్ సిద్ధూతో నెలకొన్న విభేదాల కారణంగా అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి గత సంవత్సరం రాజీనామా చేశారు. అనంతరం చరణ్‌జిత్ సింగ్ చన్నీనని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. అనంతరం అమరీందర్ సింగ్ సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో భాజపాతో కలిసి ఆయన పోటీ చేస్తున్నారు.