Process To Block The Election And Spam Calls: దేశమంతా ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎటు చూసినా నేతల ప్రచారం, విమర్శలు, ప్రతి విమర్శలు, బహిరంగ సభలు, రోడ్ షోలు, వాహనాల్లో నిరంతర క్యాంపెయిన్ ఇవే ఇవే దృశ్యాలు. ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే, నేతలు, రాజకీయ పార్టీలు బహిరంగంగానే కాదు.. డిజిటల్ పరంగానూ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఫోన్ కాల్స్, సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్టీల పథకాల ప్రచారం, తాము చేసిన అభివృద్ధి అంటూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాయి. కొన్ని స్పామ్ కాల్స్ (Spam Calls), ఎన్నికల కాల్స్ (Election Calls)తో సైతం మొబైల్ యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. రోజంతా ఎన్నికల కాల్స్ తో విసిగిపోతున్న వారి కోసం.. వాటిని ఎలా బ్లాక్ చేయాలో తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాల్స్ ఎలా బ్లాక్ చేయాలంటే.?
- 'ఎయిర్ టెల్' వినియోగదారులైతే ప్లే స్టోర్ నుంచి 'ఎయిర్ టెల్ థ్యాంక్స్' (Airtel Thanks) యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసిన అనంతరం 'ప్రీ పెయిడ్' ఆప్షన్ దగ్గర సెలక్ట్ చేసిన అనంతరం కిందకు వెళ్లి 'మోర్' (More) ఆప్షన్ సెలక్ట్ చేసి DND (Do Not Disturb) ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ తర్వాత Manageపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Block All (Except Trasactional Communications) సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత Submit పై క్లిక్ చేయాలి. (Prepaid >More >DND >Manage >Block All >Submit) ఇలా చేస్తే ఎయిర్ టెల్ వినియోగదారులకు స్పామ్, ఐవీఆర్ఎస్ కాల్స్ రాకుండా చెయ్యొచ్చు.
- అదే, జియో నెట్ వర్క్ వినియోగదారులైతే 'My Jio' యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన అనంతరం Menu >Settings >Service Settings >Do not Disturb > Fully Blocked >Save క్లిక్ చేస్తే.. స్పామ్, ఎన్నికల ఐవీఆర్ఎస్ కాల్స్ మీ మొబైల్ కు ఇక రావు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా చేస్తూ ఎన్నికల ఐవీఆర్ఎస్ కాల్స్, స్పామ్ కాల్స్ నుంచి ఉపశమనం పొందండి.