Lok Sabha Elections 2023: ఎన్నికలు వచ్చాయంటే... పొలిటికల్‌ హడావుడి ఎలానూ అలాగే. అలానే మద్యం షాపులకూ గిరాకీ పెరుగుతుంది. మద్యం అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రచారాలు, సభల హోరులో సందట్లో సడేమియాలా... పీపాలు పీపాలు ఖాళీ చేసేస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఎన్నికల సంఘం షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 48 గంటల పాటు డ్రై డేగా ప్రకటించింది. తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో... మందుబాబులు ముందు జాగ్రత  పడుతున్నారు. ముందే... తమ కావాల్సినన్ని కొని పెట్టేసుకుంటున్నారు.


తెలంగాణ (Telangana)లో ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు (Loksabha Election) జరుగుతున్నాయి. ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం షాపులు మూసివేయడం కామనే. ఎన్నికలు జరిగినప్పుడల్లా... ఇలానే చేస్తారు. ఎందుకంటే... ఎన్నికల వేళ ఎలాంటి  గొడవలు జరగకూడదని... ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్‌ జరగాలని భావిస్తారు అధికారులు. అందుకే ముందు జాగ్రత్తగా... ఎన్నికలకు 48 గంటల ముందే మద్యం షాపులు మూసివేస్తారు. ఈసారి కూడా అలాగే... చేస్తున్నారు. ఈనెల 11న  (శనివారం) సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అదే సమయంలో... అంటే 11వ తేదీ(శనివారం) సాయంత్రం 6గంటల నుంచి... ఈనెల 13న (సోమవారం) ఎన్నికలు (Election) ముగిసే వరకు మద్యం షాపులు మూసే ఉంటాయని..  తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈనె 14న (మంగళవారం) తిరిగి మద్యం షాపులను తెరుస్తారు. 


మద్యం షాపులతోపాటు... కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా మూసివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో... కల్లు దుకాణాలు కూడా మూసివేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఇలాగే జరుగుతుందని ముందే తెలుసు కనుక...  మందుబాబులు కూడా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. చుక్క పడితే కానీ... ఉండలేని వారంతా... తమకు కావాల్సిన మద్యం ముందే కొని.. ఇంట్లో భద్రపరుచుకున్నారు. ఎండల ధాటికి చల్లని బీరు కొడదామనుకున్న వారు కూడా... ముందే  బీర్లు కొనిపెట్టుకున్నారు. మొత్తంగా... తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం అందుబాటులో ఉండదు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుంది. ఆరోజు కూడా మద్యం షాపులు మూసివేస్తారు. లోకసభ ఎన్నికలే కాదు... ముఖ్యమైన పండగలు, పర్వదినాలు వచ్చినప్పుడు... ఎలాంటి గొడవలు జరగకుండా... మత ఘర్షణలు చెలరేగకుండా... ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అధికారులు.


11వ తేదీ సాయంత్రం నుంచి మద్యం షాపులు మూసివేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ... ఆ రోజు ఉదయం నుంచే చాలా వరకు షాపులు తెరిచే పరిస్థితి ఉండదు. షాపులు తెరిచినా... డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక... స్టాట్‌ ముందే అయిపోతుంది. 48 గంటల పాటు షాపులు మూసివేస్తుండటంతో... అందరూ ముందే కొని తీసుకెళ్లిపోతారు. కనుక... 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తెలంగాణలో మద్యం దొరకదు. రేపే మద్యం షాపుల్లోని స్టాక్‌ మొత్తం ఖాళీ చేసేస్తారు మందుబాబులు. 11వ తేదీ అరకొరగా షాపులు తెరిచినా... డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. మద్యం షాపులు, వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, కల్లు కాంపౌడ్లు.. మూడు రోజుల పాటు క్లోజ్‌ అవుతాయి. ఎన్నికల జరిగిన తర్వాతే రోజే... మళ్లీ షాపులు తెరుస్తారు.