Khammam Lok Sabha Elections 2024: ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి ఘన విజయం నమోదు చేశారు. ఈయన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 467847 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. రామసహాయం రఘురామ్ రెడ్డికి 766929 ఓట్లు పోలయ్యాయి. నామా నాగేశ్వరరావుకు 299082 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న తాండ్ర వినోద్ రావుకు 118636 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఈ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. తెలంగాణలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. మొత్తానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపలేదు. కానీ, ఖమ్మంలో మాత్రం రెండో స్థానంలో ఉంది. అయితే, దరిదాపుల్లో కూడా లేకుండా 4 లక్షలకు పైబడి వెనకంజలో బీఆర్ఎస్ ఉంది. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, విక్టరీ వెంకటేశ్ వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డి ఉదయం నుంచి భారీ ఆధిక్యంలో కొనసాగారు. ఈయనకు ఉదయం 11 గంటల సమయానికి 742276 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 451861 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీజేపీ తాండ్ర వినోద్ రావు 626726 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు.