YS Jagan will resign from the post of CM in the afternoon : వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేయనున్నారు. ఆయన కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీకి ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయే అవకాశం కనిపిస్తోంది.రెండో సారి అధికారంలోకి రావాలనుకున్న జగన్..అన్ని ప్రయత్నాలు చేశారు.కానీ... పాలన గురించి పట్టించుకోకుండా పూర్తిగా బటన్లు నొక్కి అప్పులు చేసి పంచడం మీదే్ దృష్టి కేంద్రీకరించడంతో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితం వైసీపీ పెద్దలందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
Andhra Pradesh Assembly Election Results : షాక్లో వైసీపీ - కాసేపట్లో వైఎస్ జగన్ రాజీనామా
ABP Desam
Updated at:
04 Jun 2024 12:12 PM (IST)
Assembly Elections 2024 : ఘోరపరాజయానికి గురి కావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. మరోసారి అధికారంలోకి వస్తామనుకున్న ఆయన ఘోరంగా ఓడిపోయారు.
కాసేపట్లో జగన్ రాజీనామా