Pawan Kalyan Interesting Comments On His MLA Salary: ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు మరింత బాధ్యత పెంచాయని అన్నారు. 'నేను కూడా ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా. ఎందుకంటే ఈ డబ్బు ప్రజల రక్తం, చమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు ఆ బాధ్యత అనుక్షణం గుర్తు రావాలి. ఒకవేళ నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే పూర్తి జీతం తీసుకుంటాను. ఆ తర్వాత ఇవ్వాల్సింది ఎలాగో ఇచ్చేస్తాను. అందరం కూడా జవాబుదారి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం.' అని పవన్ పేర్కొన్నారు.










'బాధ్యతతో ఉండాల్సిన సమయం'


ఇది పండుగ చేసుకునే సమయం కాదని.. బాధ్యతతో ఉండాల్సిన సమయమని పవన్ కల్యాణ్ అన్నారు. చట్టాలను చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దామని.. పార్లమెంటుకు వెళ్లేది ప్రజల కోసం పని చేయడానికే అని గుర్తుంచుకోవాలన్నారు. రక్తం ధారబోసిన జనసైనికులు, వీర మహిళలు పార్టీని గెలిపించారని చెప్పారు. 'కేంద్రంలో కీలకం కాబోతున్నాం. ఎంపీలు ఉదయ్, బాలశౌరికి చాలా బాధ్యత ఉంది. ఢిల్లీ జనసేన ఎంపీల కదలికలను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది అద్భుత విజయం. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం చారిత్రాత్మక విజయం.' అని పవన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎంత బాధ్యతగా ఎలా పని చేశామో.. అంతకు మించిన స్థాయిలో ఇక నుంచి కూడా పార్టీ కోసం పని చేయాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సూచించారు.


Also Read: Jr NTR on Chandrababu: మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన