Passbook Politcs : ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికలుక ముందు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఇప్పటికే విస్తృత చర్చ జరుగుతోంది. అందులో ఉన్న అంశాలు రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ చట్టం ప్రకారం సర్వే చేస్తూ రైతులకు ఇస్తున్న పాస్ బుక్‌లు మరింత వివాదాస్పదంగా  మారుతున్నాయి. రైతులకు ఇస్తున్న పాస్  బుక్కులపై వైసీపీ రంగులతో  పాటు జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బొమ్మ ఉంటోంది. నిజానికి ప్రభుత్వ రికార్డులు, నిబంధనల ప్రకారం.. పాస్ బుక్‌లపై ప్రభు్తవ  ముద్ర మాత్రమే ఉండాలి. వేరే చిహ్నాలు ఉంటే చెల్లవు. కానీ కొత్తగా ఇస్తున్న పాస్‌ బుక్‌లు పలు లోపాలతో ఉంటున్నాయి. ఈ అంశంపై పులివెందులలో ప్రచారంలో ఉన్న ఓ సీఎం జగన్ సతీమణి భారతిరె్డ్డిని వైసీపీకే  చెందిన ఓ రైతు ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  టీడీపీ సోషల్ మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. 


 





 


ఇలా ఇస్తున్న పాస్ బుక్‌లు  తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఇలా ఓ రైతుకు ఇచ్చిన పాస్ లో తప్పుడు వివరాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని బయటపెట్టిన దేవినేని ఉమ ప్రభుత్వంపై విమర్సలు చేశారు.  ప్రజలు తమ ఆస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నూతన భూ హక్కు చట్టం రూపంలో ప్రమాదం పొంచి ఉందన్నారు.  రోజూ ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితిని రాష్ట్రంలో తీసుకువచ్చారని..  పూర్వీకులు ఇచ్చిన మా పొలాల పట్టాదార్ పాస్ బుక్ లపై జగన్ బొమ్ములు ఎందుకన ిప్రశ్నించారు.  ఒక్క పాస్ బుక్‌లో రైతువి రెండు ఫోటోలు ఉంటే.. జగన్ వి 9ఫోటోలు వేసుకున్నాడు. ఇంతకీ ఈ భూమి ఎవరిదని ప్రశ్నించారు. 


 





నిజానికి వంశపారపర్యంగా వచ్చిన ఆస్తుల విషయంలో పాస్ బుక్ లు ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఉండాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది ముఖ్యం కాదు. ఎవరిది ప్రభుత్వం అనేది మ్యాటర్ కాదు.. ప్రభుత్వం మాత్రమే ఫైనల్. గత ప్రభుత్వాల వరకూ అందరూ అదే  చేసేవారు. తెలంగాణలో ధరణి  పేరుతో కొత్త వ్యవస్థ తీసుకు వచ్చి  పాస్ బుక్‌లు ఇచ్చారు. అక్కడి ప్రభుత్వం సంపూర్ణ వివరాలతో కేవలం ప్రభుత్వ చిహ్నంతోనే పాస్ బుక్‌లు జారీ చేసింది. ఎక్కడా వివాదాస్పదం కాలేదు. కాన ధరణి పోర్టల్ పనితీరుపై వివాదాలున్నాయి అది వేరే విషయం. 



తెలంగాణలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ అమలు చేయలేదు. ఏపీలోనే అమలు ప్రారంభించారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా.. అమలు చేయడం లేదని మంత్రి చెబుతున్నారు. కానీ సమగ్ర భూసర్వే ఈ కొత్త చట్టం ప్రకారమే జరుగుతోందని చెబుతున్నారు. రాను రాను ఈ పట్టాదాసు పాస్ పుస్తకం అంశం రాజకీయంగా పెను సంచలనం అవుతోంది.