Srikakulam News: శ్రీకాకుళంలో బీజేపీ(BJP)కి టికెట్ ఇవ్వడం వెనుక పెద్ద కథే ఉందన్న చర్చ సిక్కోలు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇక్కడ టీడీపీ(TDP)లో రెండు వర్గాలు ఉన్నందున వారికి చెక్ పెట్టడంతోపాటు కీలకమైన నేతను ఎన్నికల తర్వాత టీడీపీలోకి ఆహ్వానించవచ్చని పొటిలికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఇది చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమా లేకుంటే అలాంటి చర్చలు ఏమైనా జరిగాయా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది.
టీడీపీతో టచ్‌లో ఉన్నారా?
ఎన్నికల పొత్తుల్లో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్‌ను బీజేపీకి ఇవ్వడం దాదాపు ఖరారైపోయింది. ఇది సిక్కోలు టీడీపీ(Telugu Desam Party )లో కాస్త టెన్షన్ పుట్టించింది. ఇక్కడ బీజేపీకి టికెట్ ఇవ్వడం వెనుకాల చాలా పెద్ద స్టోరీ ఉందని టాక్ నడుస్తోంది. మారుతున్న ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) వ్యవహార శైలితో టీడీపీ వేస్తున్న స్టెప్స్‌కు లింక్ ఉందని నేతలు అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు టీడీపీతో టచ్‌లో ఉన్నారనే పుకారు షికారు చేస్తోంది.
టీడీపీలో వర్గపోరు
శ్రీకాకుళం టీడీపీలో గుండ లక్ష్మీదేవి(Gunda Lakshmi Devi), గొండు శంకర్(Gondu Shankar) మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండో వర్గం సహకరించే పరిస్థితి లేదు. అందుకే ఈ టికెట్‌ను బీజేపీకి ఇస్తే రెండు వర్గాలకు చెక్ పెట్టినట్టు ఉంటుందనీ... అదే టైంలో ధర్మానను పార్టీలోకి ఆహ్వానించినట్టు అవుతుందని ప్లాన్ చేశారట. వ్యూహాత్మకంగానే బీజేపీ అభ్యర్థి పేరును టీడీపీ వర్గాలు లీక్ చేశాయని ప్రచారంలో ఉంది.
సీఎం సమావేశాలకు గైర్హాజరు
ఈ మధ్య కాలంలో ధర్మాన ప్రసాదరావు చేస్తున్న కామెంట్స్, ఆయన ప్రర్తన వీటికి బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ మధ్య ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేతలతో ఎన్నికల సన్నద్ధతపై జగన్ వర్క్‌షాప్ నిర్వహించారు. దానికి మంత్రి ధర్మాన గైర్హాజరయ్యారు. కోల్‌కతాలోని ఓ వివాహానికి వెళ్లారు. అదే రోజు తిరిగి వచ్చి పట్టణంలోని బూత్ కమిటీలతో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం పెట్టిన సమావేశానికి కూడా ధర్మాన హాజరుకాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి ఇది బలపరుస్తోంది.
తెరపైకి చిన్నీ పేరు
కొద్ది రోజుల క్రితం సీఎంతో ధర్మాన ప్రసాదరావు సమావేశమైన ఆ వివరాలు ఇంత వరకు బయటకు రాలేదు. కానీ కళింగవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మాత్రం కొన్ని విషయాలు ప్రస్తావించారు. కుమారుడికి జగన్ సీటు ఇస్తామన్నా తాను సిద్ధంగా లేడని చెప్పారు. ఈసారికి తానే పోటీ చేస్తానని చెప్పినట్లు వివరించారు. అయితే శ్రీకాకుళం సీటు బీజేపీకి ఇస్తున్నారనే ప్రచారంతో ధర్మాన తన మనసు మార్చకున్నటు కూడా ప్రచారంలో ఉంది. ధర్మాన తనయుడు రామ్మనోహర్ నాయుడు పోటీలో ఉంటారని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే టీడీపీ వర్గాలు మద్దతు తమకే ఉంటుందని ధర్మాన ప్లాన్‌గా చెబుతున్నారు.
అలాంటి పరిస్థితి రాదంటున్న సన్నిహితులు
మొదటి నుంచి ధర్మాన, కింజరాపు కుటుంబాల మధ్య అవగాహన రాజకీయాలు ఉన్నాయని, ఇప్పుడు కూడా అచ్చెన్న ద్వారా ధర్మాన పావులు కదిపారని ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ వ్యతిరేక అజెండాతో రాజకీయాల్లోకి వచ్చిన ధర్మాన ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లబోరని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. తన పార్టీ నేతలను దారిలో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు. జిల్లాకు చెందిన కీలకమైన నేత తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.
పనులు చేయడం ఇష్టం లేకనే
వైసీపీ అధినాయకత్వంపై ధర్మానకు అసంతృప్తి ఉన్నా.. టీడీపీకి వెళ్లే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో రాజశేఖరరెడ్డి, రోశయ్య వంటి సీనియర్ల వద్ద పని చేసిన ధర్మాన ప్రసాదరావు మాట ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. చెప్పిన పనులేవీ కావడంలేదనే ప్రచారం పూర్తిగా వాస్తవం కాదు. నచ్చని పనులను చేయకుండా తప్పించుకోవడానికి ఇలాంటి ప్రచారాన్ని ధర్మాన చేస్తున్నారి కొందరు చెబుతున్నారు.
ఇడుపులపాయకు పిలుపు
ఇడుపులపాయలో తలపెట్టిన వైసీపీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమానికి ధర్మానకు పిలుపు వచ్చింది. గత ఎన్నికల సమయంలో కూడా అభ్యర్థుల జాబితాను ధర్మాన ప్రసాదరావు, నందిగం సురేష్ వెల్లడించారు. ఎంపీ అభ్యర్థులను ధర్మాన, అసెంబ్లీ అభ్యర్థులను నందిగం సురేష్ చదివి వినిపించారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తారని అంటున్నారు. అందుకే ఆయన ఇడుపులపాయ వెళ్లారు. ధర్మాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ ఇమేజ్ కంటే తన వ్యక్తిగత చరిష్మా పెంచుకోడానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తు న్నారు. అందుకే తాను ఓడిపోయినా పర్వాలేదు వ్యక్తిగతంగా ప్రేమించే వాళ్లు ఉండటం చాలా ఆనందంగా ఉందంటూ పదే పదే చెబుతున్నారు.