ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం యూజ్ చేసుకుంటుంది. ఇప్పటికే ఓట్‌ ఫ్రమ్‌ హోం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు మరో అవకాశాన్ని కూడా ప్రజలకు చేరువ చేసేందుకు టెక్నాలజీని తీసుకొచ్చింది ఈసీ. 
జనరల్‌గా పోలింగ్ రోజు వరకు గుర్తింపు కార్డుల సంగతి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తీరా పోలింగ్ రోజు తెగ హైరనా పడుతుంటారు. మరికొందరు పోలింగ్ బూత్‌ వద్దకు వెళ్లే వరకు కూడా గుర్తింపు కార్డు ఒకటి ఉండాలనే సంగతి పూర్తిగా మర్చిపోతారు. ఇలాంటి వారందరి కోసం ఈ సరికొత్త వెసులుబాటు కల్పిస్తోంది ఎన్నికల సంఘం. 


గుర్తింపుకార్డు లేకపోయినా, మర్చిపోయిన వారి కోసం ఈ ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ వద్ద మొబైల్ ఉంటే చాలు అప్పటికప్పుడు ఎక్కడైనా ఈ ఓటర్‌ గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ అంచనా వేస్తోంది. 


ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉండే ఫామ్‌ 8లోకి వెళ్లి మీ వివరాలు ఇవ్వాలి. తర్వాత సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్ చేస్తే https://voters.eci.gov.inలో ఉంటే ఈ ఈపీఐసీలోకి వెళ్లి మీ ఓటర్‌ కార్డు నెంబర్‌ ఎంటర్ చేయాలి. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. వెంటనే మీ ఈ గుర్తింపుకార్డు డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని నేరుగా ఎన్నికల అధికారులకు చూపించి ఓటు వేయవచ్చు.