Andhra Pradesh Elections News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వచ్చేనెల ప్రకటించనున్నట్టు సమాచారం. సత్యసాయి జిల్లాలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశవాహులు అధికమయ్యారు. సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆశవహులు ఆయా నియోజకవర్గం నుంచి తాము పోటీకి సిద్ధమంటూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. 


పెనుగొండ మినహా...


సత్యసాయి జిల్లావ్యాప్తంగా హిందూపురం అర్బన్, మడకశిర, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలు సత్యసాయి జిల్లాలోకి వస్తాయి. హిందూపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తరఫున దరఖాస్తు చేసుకోగా అత్యధికంగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 


త్వరలోనే ఢిల్లీకి అభ్యర్థుల జాబితా 


ఇటీవల విజయవాడలో వైఎస్‌ షర్మిల అధ్యక్షతన జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ప్రముఖులు సీనియర్ నాయకులు ఇన్చార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ జిల్లాల నుంచి అసెంబ్లీల వారీగా వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు. అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్ళి విడుదల చేయనున్నారు. 
సత్యసాయి జిల్లాలోని హిందూపురం లోకసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి మూడు దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి సంబంధించి హిందూపురం నుంచి ఇనై తుల్లా ఆయన కొడుకు సహా మరికొంతమంది దరఖాస్తు చేశారు. వాస్తవానికి వైఎస్ షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. పార్టీ టికెట్ల కోసం ఆశావాహులు అధికంగానే పోటీపడుతున్నారు. 


కొందరికి కన్ఫామ్ అయినట్టు ప్రచారం 


మడకశిర పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను ప్రకటించిన విషయం తెలిసింది. పెనుగొండలో శ్రీనివాస్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు సమాచారం. పుట్టపర్తి నుంచి పులివెందుల లక్ష్మీనారాయణ తన కోడలు భరణికి ఇవ్వాలని వైఎస్ షర్మిలకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష్మీనారాయణ తన అనుచరులతో టికెట్ తమకే వస్తుందని చెప్పడం జరిగింది. ఎలక్షన్‌లో తనకు మద్దతుగా అందరూ సహకరించాలని కోరుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. వీరితోపాటు వివిధ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టాక్ .