అది ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్. ఓ వ్యక్తి తన కుమారుడి జీవితం తియ్యగా ఉండాలని మిఠాయి లాల్ అని పేరు పెట్టాడు. ఆయన ఉద్దేశం మంచిదే. కానీ  ఆ పేరే ఆ మిఠాయిలాల్ జీవితంలో చేదు తెచ్చి పెట్టింది. ఆ పేరేంటని అందరూ వెక్కిరించేవాళ్లే. ఆ వెక్కిరింపులు.. చిన్నప్పటి నుండి ప్రారంభమై ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. తన తండ్రి చేసిన ఆ పొరపాటును తాను తన పిల్లల విషయంలో చేయకూడదనుకున్నాడు. అంటే.. మిఠాయి లాంటి పేర్లు పెట్టకూడదనుకున్నాడు. ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. పేరు వింటేనే గౌరవం ఇచ్చేలా ఉండాలనుకున్నాడు. 


యూపీ ఈవీఎంల ఫోరెన్సిక్ ఆడిట్ కోరాలి - అఖిలేష్‌కు మమతా బెనర్జీ సలహా


అందుకే తనకు పుట్టే పిల్లలకు వరుసగా జాతీయ నాయకుల పేర్లు పెట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు మిఠాయిలాల్‌కు ఏడుగురు పిల్లలు. వారి పేర్లు వరుసగా ములాయం సింగ్, కల్యాణ్ సింగ్, రాజ్ నాథ్ సింగ్, జయలలిత, బాల్ ధాకరే, జైల్ సింగ్, మన్మోహన్ సింగ్. ఇప్పుడు తన పిల్లలను ఎవరూ పేరు చూసి ఎగతాళి చేయరని.. పైగా గౌరవిస్తారని మిఠాయిలాల్ చెబుతున్నారు. 





"సాహెబ్‌"కు కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ! అలా జరిగే చాన్సే లేదట


పెద్దకుమారుడు ములాయం సింగ్ సొంత ఊరిలోనే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. తర్వాత కుమారులు కల్యాణ్ సింగ్, రాజ్ నాథ్ సింగ్ ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. జైల్ సింగ్ ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తున్నారు. మన్మోహన్ ,  బాల్ ధాకేరేలు ఇంకా చదువుకుంటున్నారు. మిఠాయిలాల్ ఫ్యామిలీ ..రాజకీయ నేతల పేర్లతో నిండిపోయింది. అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారి కుటుంబంలో కాస్తంత సందడి ఉంటుంది.ఈ సారి చాలా మంది మీరు ఎవరికి ఓటేశారని ప్రశ్నించడం ప్రారంభించారు. తామంతా ఈ సారి బీజేపీకి ఓటేశామని.. ఈ ప్రభుత్వం నుంచి చాలా పథకాలు అందాయని వారు చెప్పుకున్నారు. ములాయం సింగ్, జైల్ సింగ్ కూడా బీజేపీకి ఓటేశారన్నమాట. 


తన తండ్రికి తాత  మిఠాయి లాల్ అని పేరు పెట్టి తప్పు చేశారేమో కానీ.., తమ తండ్రి సుప్రసిద్ధ రాజకీయ నేతల పేర్లు పెట్టి మంచే చేశారని ఆ కుమారులు అంటున్నారు. తమ పేర్లతోనే తమకు ఎక్కడా లేనంత గౌరవం లభిస్తోందంటున్నారు. ఈ కుుటంబంలో ఉన్న పేర్లు భిన్నమైనవి కావడం వారంతా బీజేపీకి ఓటు వేసినట్లుగాచెబుతూంటంతో ఈ ఫ్యామిలీ మరోసారి హాట్ టాపిక్ అయింది.