ABP CVoter Himachal Exit Poll 2022 :  హిమాచల్‌ప్రదేశ్   అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్‌ ఎగ్జిట్ పోల్ లో స్పష్టంగా తెలుస్తోంది. 68 స్థానాల్లో మెజార్టీ సీట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. హిమాచల్ ప్రదేశ్‌ 68 అసెంబ్లీ స్థానాలకు  నవంబర్ 12న ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 74 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ABP News-CVoter అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల (హిమాచల్ ప్రదేశ్, గుజరాత్) నుంచి అత్యంత కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ అందిస్తుంది.  హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ శాతం సుమారుగా 75.6% అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనీష్ గార్గ్ అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో సిమ్లా అసెంబ్లీ నియోజకవర్గం అత్యల్పంగా 62.53 శాతం,  డూన్ అసెంబ్లీ నియోజకవర్గం అత్యధికంగా 85.25 శాతం పోలింగ్ నమోదు అయ్యాయి.


ఎగ్జిట్ పోల్స్ ఇలా 


ABP న్యూస్-CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం  బీజేపీ 33-41 సీట్లు సాధిస్తుందని అంచనా. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 44 స్థానాల కన్నా తక్కువగానే గెలిచే అవకాశంఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 24-32 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన 21 సీట్లు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వేలో తెలుస్తోంది.  ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీఓవర్ ఎగ్జిట్ పోల్స్ చెబుతుంది. 



  • BJP- 33-41

  • INC- 24-32

  • AAP- 00

  • OTH- 0-4


గత ఎన్నికల్లో బీజేపీ విజయం   


హిమాచల్ ప్రదేశ్ 2017 అసెంబ్లీ ఎన్నికలలో  బీజేపీ, కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. 44 సీట్లు గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్ మెజారిటీ మార్కు 35. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. CPI(M) హిమాచల్ ప్రదేశ్‌లో 2, ఇతరులు ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. హిమాచల్‌లో భాజపా అధికారంలో ఉంది. ఈ సారి కూడా కచ్చితంగా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది కాషాయ పార్టీ. 88 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు భాజపా అధికారంలోకి రాగా...జైరామ్ ఠాకూర్ సీఎం అయ్యారు. 


గుజరాత్ లో బీజేపీదే హవా


గుజరాత్‌లో భాజపా, కాంగ్రెస్, ఆప్‌ మధ్య నెలకొన్న ముక్కోణపు పోరులో ఎవరు విజయం సాధిస్తారన్న ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది. 2024 ఎన్నికల ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. పైగా..బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో గెలవడాన్ని కాంగ్రెస్, ఆప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అటు బీజేపీ మాత్రం "మేమే గెలుస్తాం" అని మొదటి నుంచి ధీమాగా చెబుతోంది. పార్టీలన్నీ గెలుపుపై ఇలా ధీమాగానే ఉన్నా..ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్నదే ఉత్కంఠ కలిగించే అంశం. దీనిపైనే ABP C Voter Survey Exit Polls ని విడుదల చేసింది. గుజరాత్‌లో గెలిచేదెవరో అంచనా వేసింది. దక్షిణ గుజరాత్‌లో బీజేపీకి 48%, కాంగ్రెస్‌కు 23%,ఆప్‌నకు 27% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓటు షేర్‌లో దాదాపు రెండు రెట్ల తేడా ఉంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన ఆమ్‌ఆద్మీ పార్టీ 27%ఓట్లను రాబట్టుకోగలిగింది.