Alliance Clean Sweep In Godavari Districts  : రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల జోరు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత ప్రాంతమైన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో కూటమి విజయ దుందుభి మోగించే దిశగా ముందుకు సాగుతోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా భారీ మెజారిటీతో ముందుకు సాగుతున్నారు. ఈ జిల్లాల్లో వైసిపి ఖాతా కూడా తెరవణ పరిస్థితి నెలకొంది. తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం, కొవ్వూరు, ఆచంట, పాలకొల్లు, ఉండి, తణుకు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. అలాగే, జనసేన పోటీ చేసిన పోలవరం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, రాజానగరం, నిడదవోలు, రాజోలు, పి గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా కొనసాగుతున్నారు. బిజెపి పోటీ చేసిన అనపర్తి నియోజకవర్గాల్లో విజయం దిశగా భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇదే జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 50 వేలకుపైగా ఆధిక్యంతో విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.